కబ్జాలపై కదిలిన యంత్రాంగం

ABN , First Publish Date - 2021-03-05T05:38:00+05:30 IST

నిజామాబాద్‌ నగర శివారులోని నాగారంలో పేదలకు ఇ చ్చిన ప్లాట్‌ల కబ్జాపై రెవెన్యూ యంత్రాంగం కదిలింది. ఆర్డీ వో ఆధ్వర్యంలో ఉత్తర, దక్షిణ, రూరల్‌ తహసీల్దార్‌ల పరిధి లో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్లాట్‌లను తనిఖీ చేయిస్తున్నారు. వారికి ఇచ్చిన ప్లాట్‌లను సర్వే నంబర్‌ల ప్రకారం సరిచూస్తూ వివరాలు సేకరిస్తున్నారు.

కబ్జాలపై కదిలిన యంత్రాంగం
నాగారం శివారులో కబ్జాకు గురైన ప్లాట్లను పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులు

నాగారంలో పేదల భూముల కబ్జాపై రెవెన్యూ అధికారుల దృష్టి

‘ఆంధ్రజ్యోతి’ కథనాలతో పాటు సీఎం  కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

తొమ్మిదేళ్లలో పేదలకు ఇచ్చిన భూములపై విచారణ చేస్తున్న అధికారులు

కబ్జాదారులకు అండగా ఉన్న ‘అధికార’ నేతకు అధిష్ఠానం నుంచి హెచ్చరికలు

నిజామాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : నిజామాబాద్‌ నగర శివారులోని నాగారంలో పేదలకు ఇ చ్చిన ప్లాట్‌ల కబ్జాపై రెవెన్యూ యంత్రాంగం కదిలింది. ఆర్డీ వో ఆధ్వర్యంలో ఉత్తర, దక్షిణ, రూరల్‌ తహసీల్దార్‌ల పరిధి లో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్లాట్‌లను తనిఖీ చేయిస్తున్నారు. వారికి ఇచ్చిన ప్లాట్‌లను సర్వే నంబర్‌ల ప్రకారం సరిచూస్తూ వివరాలు సేకరిస్తున్నారు. నివేది క అందగానే చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కబ్జా చేసి నిర్మిస్తున్న భవనాలను కూడా తొలగించడంతో పాటు కట్టడాలను నిలిపివేస్తున్నారు. భూములు తీసుకున్న లబ్ధిదారులను పిలిచి మాట్లాడేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

‘ఆంరఽధజ్యోతి’ కథనంతో వెలుగులోకి 

నగర శివారులోని నాగారంలో పేదలకు ఇచ్చిన భూము లు కబ్జాకు గురయ్యాయి. ఈ అంశాన్ని గతనెల 5వ తేదీన ‘నగర శివారులో దర్జాగా కబ్జా’ శీర్షికన ‘ఆంరఽధజ్యోతి’ వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో పలువురు లబ్ధిదారులు త మ భూములు కబ్జా అయ్యాయని రెవెన్యూ అధికారులతో పాటు కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. కొంతమంది సీ ఎం కేసీఆర్‌ కార్యాలయానికి కూడా ఫ్యాక్స్‌ ద్వారా ఫిర్యాదులను పంపించారు. ఈ ఫిర్యాదులపై సీఎం కార్యాలయం జి ల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు నిఘా వర్గా ల నివేదికను కూడా కోరింది. సీఎం కార్యాలయం ఆదేశాల కు అనుగుణంగా నిఘా వర్గాలు కూడా పేదలకు ఇచ్చిన భూముల కబ్జాపై పూర్తిస్థాయి నివేదికను సీఎంవోకు పంపి ంచారు. ఈ కబ్జాల వెనక ఎవరి పాత్ర ఉంది? ఏయే అధికారులు సహకరిస్తున్నారు? కబ్జా చేస్తున్నవారికి ఏ నేత అండ ఉంది? తదితర అంశాలను అందులో పేర్కొన్నారు. ఆ వివరాల ఆఽధారంగా కబ్జాలపైనా దృష్టిపెట్టవద్దని ఆ నేతకు కూ డా సీఎంవో నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో సదరు నేత ఆ భూముల కబ్జాకు దూరంగా ఉండాలని తన అనుచరులకు కూడా సూచించినట్టు సమాచారం. పేదల భూములు కబ్జా చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వ స్తుందని.. వాటికి దూరంగా ఉండాలని కోరినట్లు తెలిసింది. 

 సీఎంవో నుంచి ఆదేశాలతో సర్వే

ప్లాట్ల కబ్జాపై సీఎంవో నుంచి ఆదేశాలు రావడం, జిల్లా లో ప్రతిపక్షాలు కూడా ఈ భూముల కబ్జాపై ధర్నాలు చే యడంతో అధికారులు స్పందించారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి సమీక్షించి పూర్తి నివేదికను సిద్ధం చేయాలని కోరడంతో అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు. ఆర్డీవో ఆధ్వర్యంలో 8 బృందాలు ఈ సర్వేను కొనసాగిస్తున్నాయి. నాగారం పరిధి లో 2005 నుంచి 2014 వరకు పలువురు పేదలకు పట్టాలు ఇచ్చారు. వెంటనే ఇళ్ల నిర్మాణం చేసుకోవాలని కోరారు. కొం తమంది పేదలు ఇళ్ల నిర్మాణం చేసినా ఎక్కువ మంది మాత్రం కట్టుకోలేదు. ప్లాట్‌ల చుట్టూ కొం త మంది ప్రహరీ నిర్మించి వదిలివేయగా మరికొంతమంది ఖాళీగా వదిలేశారు. దీంతో ఈ ప్లాట్‌లపై కన్నేసిన పలువురు ఆ భూములను కబ్జాచేసి దొంగ పత్రాలు సృ ష్టించి విక్రయించేశారు. కొన్నవారు కూడా కొంతమంది ఇళ్ల నిర్మాణం చేపట్టారు. చివరకు కరోనా సమయంలో ఎక్కువ మంది ఆవైపునకు వెళ్లకపోవడంతో ఎక్కువగా కబ్జా అయ్యా యి. వారందరూ ఫిర్యాదు చేయడంతో ఈ కబ్జాల పర్వం వెలుగులోకి వచ్చింది. 

కబ్జాదారులకు కలిసొచ్చిన అగ్నిప్రమాదం

నాగారం ప్రాంతంలో సుమారు 600ల మందికిపైగా పే దలకు, వివిధ సంఘాలకు ఈ భూములను ఇచ్చారు.  ఆ యా సర్వే నంబర్‌ల కింద 60 గజాల నుంచి 100 గజాల వరకు కేటాయించారు. ఆ స్థలాలు ప్రస్తుతం కబ్జాలకు గురవుతున్నాయి. వీటికి సంబంధించిన కొన్ని రికార్డులు గతం లో తహసీల్దార్‌ కార్యాలయంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో కాలిపోవడం కూడా కబ్జా దారులకు కలిసివస్తోం ది. కాలిపోయిన రికార్డులను ఆధారంగా చేసుకుని ఎక్కువ మంది కబ్జాకు పాల్పడినట్టు రెవెన్యూ అధికారులు గుర్తించి నట్టు తెలుస్తోంది. ఆ సర్వే నంబర్‌ల పేరుమీద దొంగపత్రాలను సృష్టించి అమ్మకాలు చే స్తున్నట్లు వారు గుర్తించారు. ప్రభు త్వ భూమి ప్రైవేటు భూమిగా చూపెట్టి కొన్ని అమ్మకా లు చేసినట్లు ఈ బృందం దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఎనిమిది బృందాలు నివేదికలు అందించగానే వాటిపై సమీక్షించి మళ్లీ లబ్ధిదారులతో సమావేశమై వారిని ఇళ్లు నిర్మించుకోవాలని కోరనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ని బంధనల ప్రకారం నిర్మించుకోకుంటే ఇతర అవసరాలకు వాడుకునే అవకాశం ఉంది.

సర్వే కొనసాగుతోంది : రవి, ఆర్డీవో 

 ప్రస్తుతం ఈ భూములపై సర్వే కొనసాగు తోందని ఆర్డీవో రవి తెలిపారు. సర్వే నంబర్‌ల ఆధారంగా పేదలకు ఇచ్చిన పత్రాలను ప్రత్యేక బృందాలు పరిశీలిస్తున్నాయని ఆయన తెలిపా రు. అవి అందగానే లబ్ధిదారుల పత్రాలను పరిశీలిస్తామని, కబ్జా జరిగి.. కట్టడాలు చేపడుతున్నవారిని కూడా నిలిపివేస్తున్నామని తెలిపారు. పేదలకు ఇచ్చిన భూములకు రక్షణ కల్పించి.. అవి వారికే ఇచ్చి డబుల్‌ బెడ్‌రూంలు మంజూరు చేస్తే త్వర గా ఇళ్ల నిర్మాణం జరగడమేకాకుండా కబ్జాలు ఆగే అవకా శం ఉందని ఆయన తెలిపారు.

Updated Date - 2021-03-05T05:38:00+05:30 IST