భోజనంలో మెనూ పాటించాలి

ABN , First Publish Date - 2022-03-09T04:20:31+05:30 IST

విద్యార్థులకు అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనంలో మెనూ తప్పనిసరిగా పాటించాలని ఉట్నూర్‌ ఐటీడీఏ పీవో అంకిత్‌కుమార్‌ సూచించారు

భోజనంలో మెనూ పాటించాలి
మధ్యాహ్న భోజనం పరిశీలిస్తున్న పీవో అంకిత్‌కుమార్‌

- ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన పీవో
- నీళ్ల పప్పు, కుళ్లిన కూరగాయలు వండి పెట్టడంపై ఆగ్రహం

బెజ్జూరు, మార్చి 8: విద్యార్థులకు అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనంలో మెనూ తప్పనిసరిగా పాటించాలని ఉట్నూర్‌ ఐటీడీఏ పీవో అంకిత్‌కుమార్‌ సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. పాఠశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనా న్ని పరిశీలించారు. కుళ్లి పోయిన కూరగాయలు కనిపించడంతో వీటినే విద్యార్థులకు వండి పెడుతున్నారా హెచ్‌ఎంను ప్రశ్నించారు. వసతి గృహాల్లో చదువుకునే పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి మౌలిక వసతులు కల్పిస్తున్నా మీరెందుకు విద్యార్థులకు సరైన భోజనం పెట్టడంలో హెచ్‌ఎం పార్థిరాంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో వంట గదులను పరిశీలిం చగా నీళ్లతో కూడా పప్పు వండి పెట్టడాన్ని గమనించారు. విద్యార్థుల కు ప్రతి రోజు ఇలాంటి భోజమే వడ్డిస్తున్నారా అంటూ మండి పడ్డారు. స్టోర్‌ రూం తనిఖీ చేయగా కాలం చెల్లిన వస్తువులు కనిపిం చడంతో ఇలాంటి వాటిని ఎందుకు వెనక్కి పంపించలేదన్నారు. మరో సారి తీరు మార్చుకోక పోతే చర్యలు తప్పవన్నారు. పదో తరగతి విద్యార్థులు కష్ట పడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాల న్నారు. ఇంకామైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకు న్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆసుప త్రిని తనిఖీ చేశారు. మందుల స్టాక్‌ను పరిశీలించి రోగులకు అందుతు న్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది స్థానికంగా ఉండి సేవలు అందించాలని సూచించారు.

Updated Date - 2022-03-09T04:20:31+05:30 IST