అంగన్‌వాడీల విలీనాన్ని ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2021-07-13T19:02:05+05:30 IST

ప్రభుత్వ నూతన విద్యా విధానంలో..

అంగన్‌వాడీల విలీనాన్ని ఉపసంహరించుకోవాలి

తాడిపత్రి: ప్రభుత్వ నూతన విద్యా విధానంలో భాగంగా అంగన్‌వాడీలను ప్రాథమిక పాఠశాలల్లోకి విలీనం చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్ప ర్స్‌ యునియన్‌ నాయకురాళ్లు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక సీడీపీఓ కార్యాలయం ఎదుట యూనియన్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లు ఆందోళనకు దిగారు. తాడిపత్రి ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు నాగేశ్వరమ్మ, ప్రధాన కార్యదర్శి జ్యోతిలత మాట్లాడుతూ అంగన్‌వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని కోరారు.  అ నంతరం సీనియర్‌ అసిస్టెంట్‌ పార్వతికి వినతిపత్రం అందజేశారు. 


ఉరవకొండ: రాష్ట్రంలో నూతన విద్యా విధానం అమలు చేయడానికి తీసుకువచ్చిన జీవో నెంబరు 172ఏను ఉపసంహరించుకోవాలని అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యునియన్‌ నాయకురాలు ప్రభావతమ్మ పేర్కొన్నారు. స్థానిక ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట  యునియన్‌ ఆ ధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ పెండింగ్‌ బిల్లులు, సెంటర్ల అద్దెలు చెల్లించాలన్నారు. నిరసనలో    నాయకురాళ్లు పద్మ, జయమ్మ, ధనలక్ష్మి, వరలక్ష్మి, సువర్ణమ్మ పాల్గొన్నారు.  


కూడేరు : అంగన్‌వాడీల కోర్కెల దినంలో భాగంగా సోమవారం అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో స్థానిక ఐసీడీఎస్‌ కా ర్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈసందర్భంగా యూనియన్‌ కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ అంగన్‌వాడీ సెంటర్లను పాథ్రమిక పాఠశాలల్లోకి మార్చడాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. పోషణ ట్రాకర్‌ యాప్‌ను రద్దు చేయాలని, రిటర్మైంట్‌ బెనిఫిట్‌ కింద మూడు లక్షలతో పాటు, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని కోరారు. అనంతరం సీడీపీఓ శ్రీ దేవికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అధ్యక్షురాలు అరుణ, కూ డేరు, ఆత్మకూరు, రాప్తాడు, అనంతపురం రూరల్‌ మండల అంగన్‌వాడీలు పాల్గొన్నారు.


గుత్తి : సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు స్థానిక ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరోనాతో మృతి చెందిన అంగన్‌వాడీ వర్కర్లకు రూ.50 లక్షల బీమా సౌకర్యంతో పాటు కుటుంబలో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు.  అనంతరం సీడీపీఓ నాగమణికి వినతిపత్రం అందజేశారు. నిరసనలో  నా యకురాళ్లు రేష్మా, శోభారాణి, పద్మ, నిర్మల పాల్గొన్నారు


రాయదుర్గం టౌన్‌ : సీఐటీయు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ వర్కర్లు సో మవారం పట్టణంలోని శిశుసంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు మల్లికార్జు న మాట్లాడారు. తెలంగాణలో పెంచిన విధంగా అంగన్‌వాడీ వేతనాలను కనీస వేతనంగా రూ.21 వేలు ఇవ్వాలని కోరారు. నిరసనలో నాయకులు బేబీ, మేరీ, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు. 


కణేకల్లు : స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సోమవారం కణేక ల్లు, బొమ్మనహాళ్‌ మండలాల అంగన్‌వాడీ టీచర్లు ఆందోళన నిర్వహించా రు. అంగన్‌వాడీల్లో రాజకీయ జోక్యాన్ని, సచివాలయ పోలీసుల వేధింపుల ను అరికట్టాలని కోరారు. అనంతరం తహసీల్దార్‌ ఉషారాణికి వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2021-07-13T19:02:05+05:30 IST