Abn logo
Sep 25 2021 @ 00:54AM

కనీస వేతనం అమలు చేయాలి

భూదాన్‌పోచంపల్లిలో..

 స్కీం వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం ఫ దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా జిల్లావ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసనలు

భూదాన్‌పోచంపల్లి / తుర్కపల్లి / యాదాద్రి రూరల్‌ / రామన్నపేట, / ఆలేరు రూరల్‌ / సంస్థాన్‌ నారాయణపురం /  ఆలేరు / బీబీనగర్‌ / భువనగిరి రూరల్‌,సెప్టెంబరు 24:  స్కీం వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని పలువురు నాయకులు డిమాండ్‌ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశాలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన సమ్మెలో పాల్గొని తమ నిరసన తెలిపారు. పోచంపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు, మండల కన్వీనర్‌ గడ్డం వెంకటేష్‌, మంచాల మధు పాల్గొని మాట్లాడారు. అనంతరం తహసీల్దార్‌ దశరథనాయక్‌కు వినతిపత్రం అందించారు. యాదగిరిగుట్ట పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశాలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కల్లూరి మల్లేశం, ఆశా యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు ముక్కెర్ల వెంకటమ్మ పాల్గొని మాట్లాడారు. సీఐటీయూ ఆధ్వర్యంలో రామన్నపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మామిడి వెంకట్‌రెడ్డి  మాట్లాడారు. ఆలేరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ నాయకులు  ధర్నా నిర్వహించి తహసీల్దార్‌ రాముకు వినతిపత్రం అందించారు. సంస్థాన్‌నారాయణపురం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో  దోనూరి నర్సిరెడ్డి, కృష్ణ, గంగమ్మ, లలిత, రాములమ్మ, ఎల్లమ్మ, సువర్ణ పాల్గొన్నారు. ఆలేరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట స్కీం వర్కర్లు చేపట్టిన ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి మాట్లాడారు. స్కీమ్‌ వర్కర్లకు కనీస వేతనం రూ.21వేలు చెల్లించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ీ పట్టణ కన్వీనర్‌ మంగ అరవింద్‌, అంగన్‌వాడీ కేంద్రాల వర్కర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు ఏనుగుల పద్మ, గంగుల రమణ, లక్ష్మి, అనురాధ, సరిత, సుధారాణి, పద్మజ, ఇందిర, భూలక్ష్మి, మంజుల పాల్గొన్నారు. బీబీనగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట స్కీంవర్కర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. స్కీమ్‌ వర్కర్ల సమస్యలను పరిష్కరించి పర్మినెంట్‌ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  భువనగిరి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. అనంతరం తహసీల్దార్‌ శ్యాంసుందర్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం డిమాండ్‌ చేశారు. తుర్కపల్లిలో ని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ, ఆయాలతో నిర్వహించిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జహంగీర్‌ పాల్గొన్నారు.