Abn logo
Sep 22 2021 @ 23:35PM

కనీస వేతనాల జీవోలను సవరించాలి

మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేశ్‌

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేశ్‌

గణేశ్‌నగర్‌, సెప్టెంబరు 22: కార్మికులకు కనీస వేతనాల జీవోలను రాష్ట్ర ప్రభుత్వం సవరించాలని సీఐటీయూ కరీంనగర్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్‌, ఎడ్ల రమేశ్‌లు డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల కనీస వేతనం రూ.21 వేలు నిర్ణయించాలన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక గర్జన పాదయాత్ర బుధవారం రెండోరోజు చింతకుంటలో ప్రారంభమై పద్మనగర్‌ ఇండస్ర్టియల్‌ ఏరియా, తెలంగాణ చౌరస్తా, కోర్టు చౌరస్తాలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల, మంచిర్యాల చౌరస్తా నుంచి డాక్టర్‌ స్ర్టీట్‌, షాపింగ్‌ మాల్‌, గంజి ఏరియా వరకు కొనసాగింది. మున్సిపల్‌ కార్మికులు వారి సమస్యలపై పాదయాత్ర బృందానికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టి 4 కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలపై అక్టోబర్‌ 8న జరిగే రాష్ట్రవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బండారి శేఖర్‌, కోశాధికారి రాజేశం, జిల్లా కమిటీ సభ్యులు భద్రయ్య, ఇన్స్యూరెన్స్‌ ఉద్యోగులు రమణ, రామ్‌ మోహన్‌ రావు, రాజేందర్‌, వామన్‌రావు, మున్సిపల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జనగాం రాజమల్లు, జిల్లా అధ్యక్షుడు యశోద రవీందర్‌, నాయకులు రాజయ్య, మల్లయ్య, మల్లేశ్‌, కవ్వంపల్లి రవి, గంగయ్య, విజయ్‌, లక్ష్మి, లత, తదితరులు పాల్గొన్నారు.