Advertisement
Advertisement
Abn logo
Advertisement

డిసెంబరులోగా మినీస్టేడియం పనులు పూర్తి

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): డిసెంబరు నెలాఖరుకల్లా మినీ స్టేడియం నిర్మాణం పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. శనివారం సిరిసిల్ల మున్సిపల్‌ పరిఽధిలో నిర్మాణంలో ఉన్న మినీ స్టేడియం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేడియంలో రన్నింగ్‌ ట్రాక్‌, టెన్నిస్‌ కోర్టు, వాలీబాల్‌ కోర్టు, ఎంట్రీ అర్చీ నిర్మాణం పనులను పూర్తి చేయాలన్నారు. పనులు వేగంగా చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. అనంతరం వేములవాడలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటేడ్‌ మార్కెట్‌యార్డు నిర్మాణాలను పరిశీలించారు. రెండెకరాల స్థలంలో రూ 4.50 కోట్లతో నిర్మిస్తున్న మార్కెట్‌ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. వైకుంఠధామం పనులు పరిశీలించి అధికారులు వ్యక్తిగత శ్రద్ధ మహించి ప్రతి రోజూ పనులను పరిశీలించాలన్నారు. కలెక్టర్‌ వెంట సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ కమిషనర్‌లు సమ్మయ్య,  శ్యాంసుందర్‌రావు, డీఈ సుచరణ్‌ తదితరులు ఉన్నారు.


Advertisement
Advertisement