1400 ఏళ్ల క్రితం నాటి అద్భుతం... మళ్లీ ఇప్పుడు!

ABN , First Publish Date - 2021-05-28T05:30:00+05:30 IST

1400 ఏళ్ల క్రితం ఆకాశంలో జరిగిన అద్భుతం రెండు రోజుల క్రితం మళ్లీ చోటు చేసుకుంది. వైశాఖ పూర్ణిమ రోజున నిండు చంద్రుడు కనిపించడం సాధారణమే...

1400 ఏళ్ల క్రితం నాటి అద్భుతం... మళ్లీ ఇప్పుడు!

1400 ఏళ్ల క్రితం ఆకాశంలో జరిగిన అద్భుతం రెండు రోజుల క్రితం మళ్లీ చోటు చేసుకుంది. వైశాఖ పూర్ణిమ రోజున నిండు చంద్రుడు కనిపించడం సాధారణమే. కానీ అదే రోజున చంద్రగ్రహణం ఏర్పడటం అరుదైన సంఘటనగా నిలిచింది. 1400 ఏళ్ల క్రితం ఈ విధంగా జరిగింది. తిరిగి రెండు రోజుల క్రితం అంటే 26వ తేదీన ఆ అద్భుతం కనువిందు చేసింది. అంతేకాకుండా ఈ రోజుకు మరో విశేషం ఉంది. 1400 ఏళ్ల క్రితం ఇదే రోజున చాళక్య రాజ్యాన్ని పాలిస్తున్న పులకేశి -2, వర్ధన రాజ్యాన్ని పాలిస్తున్న హర్షవర్ధనుడిపై యుద్ధంలో విజయం సాధించాడు. చాళక్యులు 6వ శతాబ్దంలోనూ, 12వ శతాబ్దంలోనూ మధ్య, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించారు. వర్ధన రాజవంశీయులు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించారు. వైశాఖ పూర్ణిమ సందర్భంగా హిందువులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. నదుల్లో పవిత్రస్నానాలు ఆచరిస్తారు. అయితే ఇదే రోజున చంద్రగ్రహణం కూడా ఏర్పడటంతో మరింత ప్రాధాన్యత ఏర్పడింది. 

Updated Date - 2021-05-28T05:30:00+05:30 IST