Abn logo
Aug 4 2020 @ 05:43AM

మద్యం దుకాణాన్నిమూసివేయించిన ఎమ్మెల్యే

కందుకూరు, ఆగస్టు 3: సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలవుతున్న కందుకూరు పట్టణంలో సోమవారం హడావుడిగా మద్యం దుకాణాలు తెరిచారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి వెంటనే ఎక్సైజ్‌ ఉన్నతాధికారులతో మాట్లాడారు. కందుకూరులో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని ఈ దశలో మద్యం దుకాణాలు తెరిస్తే మరింత ప్రమాదమని తక్షణం మూసివేయాలని సూచించి మద్యం దుకాణాలను మూసివేయించారు.

Advertisement
Advertisement
Advertisement