మోదీ సర్కారు మా హక్కులను కాపాడింది

ABN , First Publish Date - 2021-08-02T07:11:09+05:30 IST

మోదీ సర్కారు తమ ప్రాథమిక హక్కులను కాపాడిందని ట్రిపుల్‌ తలాక్‌ బాధిత మహిళలు అన్నారు.

మోదీ సర్కారు మా హక్కులను కాపాడింది

కేంద్ర మంత్రులకు చెప్పిన ట్రిపుల్‌ తలాక్‌ బాధితులు

న్యూఢిల్లీ, ఆగస్టు 1: మోదీ సర్కారు తమ ప్రాథమిక హక్కులను కాపాడిందని ట్రిపుల్‌ తలాక్‌ బాధిత మహిళలు అన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ రద్దు చట్టం తీసుకొచ్చి ప్రభుత్వం తమ స్వావలంబనకు కృషి చేసిందని, ఆత్మగౌర వం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని ముస్లిం మహిళలు చెప్పారు. భారత్‌లో ట్రిపుల్‌ తలాక్‌కి వ్యతిరేకంగా చట్టం రూపొందించి రెండేళ్లు గడుస్తున్న నేపథ్యంలో పలు సంస్థలు దేశవ్యాప్తంగా ముస్లిం మహిళల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాయి. ట్రిపుల్‌ తలాక్‌ బాధిత మహిళలతో కేంద్ర మంత్రులు మాట్లాడారు. ట్రిపుల్‌ తలాక్‌ రద్దు చట్టం అమల్లోకి వచ్చాక తలాక్‌ కేసులు తగ్గాయని ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ చెప్పారు.

Updated Date - 2021-08-02T07:11:09+05:30 IST