అసలే కోతి.. దానికి దొరికిందో బ్యాగ్.. అందులో రూ.500 నోట్ల కట్టలు.. చెట్టెక్కి ఆ వానరం చేసిన నిర్వాకమిది..!

ABN , First Publish Date - 2021-09-18T00:36:03+05:30 IST

నోట్ల కట్టలున్న సంచీతో చెట్టెక్కిన కోతి.. ఆ తరువాత..రచ్చ రచ్చ

అసలే కోతి.. దానికి దొరికిందో బ్యాగ్.. అందులో రూ.500 నోట్ల కట్టలు.. చెట్టెక్కి ఆ వానరం చేసిన నిర్వాకమిది..!

ఇంటర్నెట్ డెస్క్: నగదు ఉన్న బ్యాగును చేతిలో పట్టుకుని పక్కనున్న వ్యక్తితో మాట్లాడుతున్నాడా అడ్వకేట్. ఇంతలో ఓ వానరం కన్ను ఆ బ్యాగ్‌పై పడింది. అంతే..ఒక్క ఉదుటున ముందుకు ఉరికి చట్టుకున్న సంచీని లాక్కుంది. అసలేం జరిగిందో ఆ లాయర్‌కు అర్థమయ్యేలోపే..ఆ కోతి చెట్టేక్కేసింది. ఇక అక్కడ నుంచీ మొదలైంది అసలు తమాషా..! కింద ఉన్న లాయరేమో లబోదిబో మంటుంటే కోతేమో రూ. 500ల నోట్లను గాల్లో ఎగరేసి రచ్చ రచ్చ చేసింది. స్థానికులు కొందరు ఆ చెట్టు చుట్టూ చేరడంతో దానికి మరింత సరదాగా అనిపించి..విచ్చలవిడిగా నోట్ల వర్షం కురిపించింది. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ జిల్లాల్లో శుక్రవారం జరిగిందీ ఘటన.

ఇవీ చదవండి:

కూతురు కిడ్నాపైందంటూ కేసు..నిజం తెలిసి పోలీసులే షాక్!

ఫ్రెండ్ భార్యతో ప్రేమాయణం.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఇలా..


కోతి నిర్వాకానికి లాయర్ వినోద్ బాబుకు నోట మాటరాలేదు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆయన స్నేహితులు ఆ నోట్లను ఏరి ఆయనకు ఇచ్చారు. అదృష్టవశాత్తూ స్థానికులు కూడా నోట్లను ఏరీ ఒక్క చోట చేర్చడంతో బ్యాగులోని సోమ్ములో చాలామటుకు లాయర్‌కు అందింది. ఆ బ్యాగులో మొత్తం లక్ష రూపాయలను ఉన్నాయని వినోద్ తెలిపారు. అన్నీ రూ. 500ల నోట్లని పేర్కొన్నారు. కోతి బ్యాగు ఖాళీ చేశాక..మొత్తం 17 నోట్లు మాత్రం లెక్కలోకి రానట్టు తేలింది. అయితే..నష్టం స్వల్ప స్థాయిలో ఉండటంతో వినోద్ సంబరపడిపోయారు. స్థానికులకు తోటి లాయర్లకు ధన్యవాదాలు తెలిపారు. కోతుల కోసమని ఆ ప్రాంతంలో ఆహారాన్ని పెట్టడంతో పెద్ద సంఖ్యలో కోతుల మంద వచ్చి చేరిందని స్థానికులు చెప్పారు. ఈ క్రమంలోనే న్యాయవాదికి ఇలాంటి ఊహించని పరిస్థితి ఎదురైంది. 

Updated Date - 2021-09-18T00:36:03+05:30 IST