అత్యంత ఖరీదైనది!

ABN , First Publish Date - 2021-09-29T05:30:00+05:30 IST

భూమిపై అత్యంత ఖరీదైన వస్తువు ఏది? అని అడిగితే

అత్యంత ఖరీదైనది!

భూమిపై అత్యంత ఖరీదైన వస్తువు ఏది? అని అడిగితే ... ప్లాటినం అని, డైమండ్‌ అని అంటారు. కానీ ఆ రెండింటి కన్నా ఖరీదైనది ఒకటుంది? అదేంటో తెలుసా? అక్విలేరియా అనే చెట్ల నుంచి తీసే ఒకరకమైన పదార్థం. దీన్ని జపాన్‌లో ‘క్యారా’ అని పిలుస్తారు. దీన్ని పర్‌ఫ్యూమ్‌లు, అగర్‌వత్తుల తయారీలో వాడతారు. 




 క్యారా ఒక గ్రాము ధర సుమారు 7 లక్షలు పలుకుతుంది. దీన్ని బట్టి ఇది ఎంత విలువైనదో అర్థం చేసుకోవచ్చు. 


 అక్విలేరియా(శాస్త్రీయనామం) అని పిలిచే మొక్క నుంచి క్యారా ఉత్పత్తి అవుతుంది. చెట్టు కాండం మధ్యభాగంలో కొన్ని పరాన్నజీవులు చేరి చర్యనొందడం వల్ల ఇది తయారవుతుంది. ఈ చెట్టు ఆసియా దేశాల్లో అతి తక్కువగా కనిపిస్తుంది. ఈమధ్యకాలంలో ఇండోనేషియా, వియత్నాం, మయన్నార్‌ వంటి ఆసియా దేశాల్లో ప్రజలు ఈ చెట్లను పెంచడానికి ఆసక్తి చూపుతున్నారు.


 కంబోడియాలోని వాట్‌ బ్యాంగ్‌ క్రాదాన్‌ ఆలయ ప్రాంగణంలో రెండు వందల ఏళ్ల నాటి అక్విలేరియా చెట్టు ఉంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన చెట్టుగా దీనికి గుర్తింపు ఉంది. 

Updated Date - 2021-09-29T05:30:00+05:30 IST