పిల్లల నడవడికకు తల్లే తొలి గురువు

ABN , First Publish Date - 2021-10-24T07:06:14+05:30 IST

పిల్లల నడవడికకు తల్లే తొలి గురు వని జిల్లా రెండో అదనపు జడ్జి వసంత్‌పాటిల్‌ అన్నారు. సూర్యాపేటలోని కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన శిబిరంలో ఆయన మాట్లాడారు.

పిల్లల నడవడికకు తల్లే తొలి గురువు
మాట్లాడుతున్న జిల్లా రెండో అదనపు జడ్జి వసంత్‌పాటిల్‌

సూర్యాపేట లీగల్‌, అక్టోబరు 23: పిల్లల నడవడికకు తల్లే తొలి గురు వని జిల్లా రెండో అదనపు జడ్జి వసంత్‌పాటిల్‌ అన్నారు. సూర్యాపేటలోని  కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన శిబిరంలో ఆయన మాట్లాడారు. విజ్ఞానాన్ని వినాశనానికే కాకుండా మానవ వికాసానికి వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా పరిస్థితుల్లో పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసుల అవసరాలకు తల్లిదండ్రులు సెల్‌ఫోన్లు అందిం చారని, అయితే తల్లిదండ్రులు పర్యవేక్షణతో పిల్లలు తప్పుదోవ పడుతున్నారన్నారు. పిల్లలకు కుటుంబ విలువలు, మర్యాద నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్య క్షుడు గుడిపూడి వెంకటేశ్వరరావు, న్యాయసేవా సంస్థ  మండల సభ్యుడు     వై.వెంకటబుచ్చేశ్వర్‌రావు, న్యాయవాదులు పాల్గొన్నారు. 

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ఆత్మకూర్‌(ఎస్‌): చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి సీహెచ్‌ జితేందర్‌ అన్నారు. మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌లో న్యాయ అధికారుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  చట్టాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన  మాట్లాడారు. ప్రతీ వ్యక్తి న్యాయ సంబంధమైన చట్టాల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో నాయకులు జటంగి సౌడయ్య, వత్సవాయి లలిత, నాయిని సైదులు, దైద నాగేందర్‌, అలివేలు పాల్గొన్నారు.  

 చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

 నూతన్‌కల్‌: చట్టాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని తుంగ తుర్తి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞానసుందర్‌ అన్నారు. మండల పరిధిలోని మాచనపల్లి, బిక్కుమల్ల గ్రామాల్లో నిర్వహించిన చట్టాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు ప్రజలు  కేసుల వరకు వెళ్లి, డబ్బు వృథా చేసుకో వద్దని, అలాంటి పంచాయితీలను గ్రామాల్లోనే పరిష్కారం చేసుకోవా లన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు కుందెన అమ్మక్క భద్రాచలం, బాషనపల్లి అశోక్‌, న్యావాదులు రాజారాం, రవికుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-10-24T07:06:14+05:30 IST