Apr 10 2021 @ 14:48PM

‘ఆర్ఆర్ఆర్‌’ని బీట్ చేసిన ‘పుష్ప‌’రాజ్

కరోనా పుణ్యమా అంటూ టాలీవుడ్‌లో పెద్ద పెద్ద సినిమాల మధ్యనే.. ఇంకా చెప్పాలంటే పాన్ ఇండియన్ సినిమాల మధ్యనే భారీ స్థాయిలో గట్టి పోటీ ఉంటోంది. గత ఏడాది రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ కరోనా వల్ల షూటింగ్ దశలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ మొత్తం దాదాపు 7-8 నెలలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. ఎట్టకేలకి మళ్ళీ అన్నీ సినిమాల షూటింగ్స్ మొదలై అఫీషియల్‌గా రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాయి. కానీ కరోనా మళ్ళీ 'నేనున్నా ..సెకండ్ వేవ్ రూపంలో వస్తున్నా' అంటూ షాకిచ్చింది. దాంతో మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో ఇబ్బందులు మొదలయ్యాయంటున్నారు. కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఆగిపోతే కొన్ని సినిమాలు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ నటించిన 'సూర్యవన్షి' పోస్ట్ అవగా.. పాన్ ఇండియన్ సినిమా 'తలైవి' కూడా పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు మేకర్స్ అధికారకంగా వెల్లడించారు.

ఇక టాలీవుడ్‌లో అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'లవ్ స్టోరి' సినిమాని కూడా పోస్ట్‌పోన్ చేశారు. కాగా ఇప్పుడు టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు రిలీజ్ కూడా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్‌'తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పోటీ కాబోతోందని చెప్పుకుంటున్నారు. అల్లు అర్జున్ రీసెంట్‌గా తను నటించిన 'పుష్ప' ఇంట్రడక్షన్ వీడియోతో రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. ఇంతక ముందు వచ్చిన పాన్ ఇండియా సినిమాలు 'బాహుబలి 1 అండ్ 2', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ 'రోబో 2.ఓ' సినిమాల టీజర్స్ రికార్డ్స్‌ని 'పుష్ప' సినిమా ఇంట్రడక్షన్ వీడియో బీట్ చేయడం విశేషం. అయితే 'పుష్ప' సినిమా రిలీజయ్యాక కూడా 'ఆర్ఆర్ఆర్' సినిమాకి వసూళ్ళ పరంగా కొత్త రికార్డ్స్ పరంగా భారీ స్థాయిలో పోటీ ఇవ్వడం ఖాయమంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.