మునిసిపల్‌ బడ్జెట్‌ రూ.86.87 కోట్లు

ABN , First Publish Date - 2020-05-20T09:40:59+05:30 IST

మహబూబాబాద్‌ మునిసిపల్‌ 2020-21 ఆర్థిక సంవత్సర రూ.86.87 కోట్ల అంచనా బడ్జెట్‌కు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.

మునిసిపల్‌ బడ్జెట్‌ రూ.86.87 కోట్లు

ఆమోదం తెలిపిన మానుకోట కౌన్సిల్‌


మహబూబాబాద్‌ టౌన్‌, మే 19 : మహబూబాబాద్‌ మునిసిపల్‌ 2020-21 ఆర్థిక సంవత్సర  రూ.86.87 కోట్ల అంచనా బడ్జెట్‌కు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. మహబూబాబాద్‌ నందన గార్డెన్స్‌లో మంగళవారం మునిసిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన బడ్జెట్‌ సమావేశాన్ని నిర్వహించగా కమిషనర్‌ బి.ఇంద్రసేనారెడ్డి బడ్జెట్‌ను కౌన్సిల్‌లో ప్రవేశపెట్టారు. ఆస్తి పన్ను రూ.3.83 కోట్లు, స్టాంపు డ్యూటీ రూ.1.90 కోట్లు, నాన్‌ ట్యాక్స్‌ వనరులు రూ.1.37 కోట్లు, పారిశుధ్య విభాగం రూ.38.46 లక్షలు, పట్టణ ప్రణాళిక విభాగం రూ.4.22 కోట్లు, ఇంజనీరింగ్‌ విభాగం రూ.2.35 కోట్లు, ఇతరత్రాతో 86.87 కోట్ల ఆదాయంతో అంచనా బడ్జెట్‌ను రూపొందించారు. వేతనాలు రూ.3.91 కోట్లు, విద్యుత్‌ చార్జీలు రూ.2.6 కోట్లు, శానిటేషన్‌ రూ.1.18 కోట్లు, హరితహారానికి రూ.1.80 కోట్లు, ఇంజనీరింగ్‌ విభాగం నిర్వహణ రూ.1.74 కోట్లు, పట్టణ ప్రణాళిక విభాగం రూ.12.24 కోట్లు, ఇతరత్రా ఖర్చులతో రూ. 86.81 కోట్లు వ్యయం అవుతుందని అంచనా బడ్జెట్‌లో పొందుపరిచారు. ఈ బడ్జెట్‌కు కౌన్సిల్‌ సభ్యులు అమోద ముద్ర వేశారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌, ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, వైస్‌ చైర్మన్‌ ఎండి.ఫరీద్‌, ఫ్లోర్‌ లీడర్లు వెన్నం లక్ష్మారెడ్డి, బి.అజయ్‌, సూర్నపు సోమయ్య, చిట్యాల జనార్దన్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-20T09:40:59+05:30 IST