న్యాయవాదుల హత్య కేసును సీబీఐతో విచారించాలి

ABN , First Publish Date - 2021-02-25T05:40:57+05:30 IST

దారుణ హత్యకు గురైన హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణిల కేసును సీబీఐతో విచారణ జరిపించాలని నిర్మల్‌ జిల్లా బార్‌ అసోసియేషన్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు.

న్యాయవాదుల హత్య కేసును సీబీఐతో విచారించాలి
కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు

- బాధిత కుటుంబానికి రూ. 10కోట్ల నష్టపరిహారం ఇవ్వాలి

- నిర్మల్‌ బార్‌ అసోసియేషన్‌ సభ్యుల డిమాండ్‌

మంథని/మంథని రూరల్‌, ఫిబ్రవరి 24: దారుణ హత్యకు గురైన హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణిల కేసును సీబీఐతో విచారణ జరిపించాలని నిర్మల్‌ జిల్లా బార్‌ అసోసియేషన్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంలో గట్టు వామన్‌రావు కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తమ సానుభూతిని ప్రకటించారు. అనంతరం ఈ సంఘటనపై మంథని కోర్టు ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. హత్యలను ఖండిస్తూ.. నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. న్యాయవాదుల హత్య కేసుల విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. బాధిత కుటుంబానికి రూ.10 కోట్లనష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సంఘటలో పాత్రధారులతో పాటు సూత్రధారులను కూడా చట్టపరంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్‌ బార్‌ అసోసియేషన్‌ అఽధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ అధ్యక్షుడు గోవర్ధన్‌, మంథని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు హరిబాబు, రమణకుమార్‌రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T05:40:57+05:30 IST