కార్యకర్తల హత్య పాశవిక చర్య

ABN , First Publish Date - 2021-05-06T05:20:11+05:30 IST

పశ్చిమబెంగాల్‌లో తృణ మూల్‌ కాంగ్రెస్‌ పార్టీ గుండాలు బీజేపీ కార్యకర్తలను దాదాపు 20మందిని కిరాతకంగా హత్య చేయడం పాశ విక చర్యగా మాజీ మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ బీ.కృష్ణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డీ.నారాయణ అన్నారు.

కార్యకర్తల హత్య పాశవిక చర్య
వనపర్తిలోని రాజీవ్‌చౌక్‌లో నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు

 - మాజీ మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ బీ.కృష్ణ 8 బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు

వనపర్తి అర్బన్‌, మే5: పశ్చిమబెంగాల్‌లో తృణ మూల్‌ కాంగ్రెస్‌ పార్టీ గుండాలు బీజేపీ కార్యకర్తలను దాదాపు 20మందిని కిరాతకంగా హత్య చేయడం పాశ విక చర్యగా మాజీ మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ బీ.కృష్ణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డీ.నారాయణ అన్నారు. ఈ హత్యలను  నిరసిస్తూ రాజీవ్‌చౌక్‌లో బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు.  అ నంతరం వారు మాట్లాడుతూ పశ్చిమబెంగాల్‌లో శా సన సభ ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం మమతా బెనర్జీ బీజేపీ ఎదుగుదలను ఓర్చుకోలేక రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆస్తులపై దాడిచేసి ఇ ళ్లకు నిప్పుపెట్టి ధ్వంసం చేసినట్లు ఆరోపించారు. ప్ర జాస్వామ్యంలో ఎన్నికల్లో వివిధ రాజకీయ పక్షాలు పో టీ చేయడం అందులో ఓటమి, గెలుపు సమానం అనే విషయాన్ని సుదీర్ఘ రాజకీయ అనుభవం, పదేళ్లు  సీఎంగా పరిపాలన చేసిన మమతా బెనర్జీకి తెలియక పోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జి ల్లా ప్రధాన కార్యదర్శి అక్కల రామన్‌గౌడ్‌, బుడ్డన్న, ఉ పాధ్యక్షులు కుమారస్వామి, సుమిత్రమ్మ, వెంకటేశ్వ ర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి పరశురాం, అధికార ప్రతినిధి పెద్దిరాజు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కల్పన, పట్టణ ప్రధాన కార్యదర్శి రాములు, దళిఇత మోర్చా జిల్లా అధ్యక్షుడు కుమార్‌, ప్రధాన కార్యదర్శి నరసింహ, జిల్లా కార్యవర్గ సభ్యుడు ద్వారపోగు సుబ్రహ్మణ్యం, సురేందర్‌, రాయన్న, బాలస్వామి, లక్ష్మీనారాయణ, మధు, రవినాయుడు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. 

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట..

పాన్‌గల్‌ మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యా లయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి రోజారమణి మాట్లాడుతూ బంగ్లాదేశ్‌ రోహిం గ్యాలను అడ్డుపెట్టుకొని హిందువులపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి దాడులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఆ పార్టీ మండల అధ్య క్షుడు అన్వేష్‌, ఉపా ధ్యక్షుడు రామకృష్ణ, యువమోర్చా ప్రధాన కార్యదర్శి రమేష్‌, మండల ప్రధాన కార్యదర్శి రమేష్‌నాయుడు, నాయకులు తిఇరుపతయ్య, ఆదిత్య రెడ్డి, కురుమయ్య, రమేష్‌యాదవ్‌, రాజేష్‌, సాయిబాబా పాల్గొన్నారు. 

రేవల్లిలో...

స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ముందు బీజేపీ మండల అధ్యక్షుడు అజయ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో బుధవా రం నిరసన కార్యక్రమం చేపట్టారు. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ నాయకులు మా ట్లాడుతూ పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ కా ర్యకర్తలు రౌడీల్లాగా వ్యవహరిస్తూ బీజేపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తూ హత్య చేయడాన్ని ఖండిస్తోం దన్నారు. బీజేవైఎం జిల్లా కార్యదర్శి పరుశరాం, చంద్రయ్య, శంకర్‌, మైబూస్‌ తదితరులు పాల్గొన్నారు. 

పెద్దమందడిలో...

మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మండల అధ్యక్షుడు రమేష్‌ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌లో మూడు స్థానాల్లో ఉన్న బీజేపీ నిన్న జరిగిన ఎన్నికల్లో  70 స్థానాలు  గెలుచుకోవడంతో టీఎంసీ నాయకులు బీజేపీ కార్యకర్తలపై దాడిచేయడం పిరికి చర్య అ న్నా రు. బీజేపీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి అశ్విని రాధా, జిల్లా కిసాన్‌ మోర్చా సభ్యులు కృష్ణయ్య, కొం డన్న, నాయకులు మహేష్‌, గోవర్దన్‌ పాల్గొన్నారు. 

అమరచింతలో...

 మండల పరిధిలోని కిష్టంపల్లిలో బీజేపీ కార్యకర్త మల్లారెడ్డి పశ్చిమబెంగాల్‌ హత్యలకు వ్యతిరేకంగా ని రసన కార్యక్రమాన్ని బుధవారం కొనసాగించారు. బీ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపుమేరకు క రోనా వైరస్‌ నేపథ్యంలో స్వగృహంలోనే ఆయన టీఎంసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 


Updated Date - 2021-05-06T05:20:11+05:30 IST