రైల్వే స్టేషన్‌ల పేర్లు సరిదిద్దాలి

ABN , First Publish Date - 2021-04-20T06:08:19+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రిటిష్ వారి హయాంలో మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో కొన్ని రైల్వే స్టేషన్‌ల పేర్లు...

రైల్వే స్టేషన్‌ల పేర్లు సరిదిద్దాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రిటిష్ వారి హయాంలో మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో కొన్ని రైల్వే స్టేషన్‌ల పేర్లు అప్పటి బ్రిటిష్ పాలకులు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు, ఆంగ్లంలో ఉచ్ఛరించే విధంగా ఆంగ్లంలో ఉన్నాయి. ఉదాహరణకు విజయనగరం ఊరును ఆంగ్లంలో VIJAYA NAGARAMగా రాయవచ్చు కానీ VIZIA NAGARAMగా రాస్తున్నారు. అలాగే రాజం పేటను RAJAMPETAగా కాక RAZAM PET గాను, సామర్లకోటను SAMARLA KOTAగా కాక SAMALKOTAగానూ రైల్వే శాఖ పేర్కొంటోంది. ఈ ఆంగ్ల స్పెల్లింగులను మార్చ వలసిన ఆవశ్యకత వుంది. దీనికోసం రైల్వే శాఖకు కేవలం రాష్ట్రప్రభుత్వం ద్వారా జిల్లా కలెక్టర్ సహేతుకమైన వివరణతో ప్రతిపాదన పంపించాలి. బెజవాడ పేరును విజయవాడగా మార్చినపుడు ఈ ప్రక్రియ జరిగింది. ఈ మధ్యనే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన మేరకు అలహాబాద్, ముగల్ శరాయ్ స్టేషన్ పేర్లను ప్రయాగ్ రాజ్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్‌లుగా మార్చటం జరిగింది.


పైన పేర్కొన్న స్టేషన్ల పేర్లను మాత్రమే కాక ఇటువంటి పొరపాట్లు మరే ఇతర రైల్వే స్టేషన్‌ల పేర్ల ఆంగ్ల స్పెల్లింగులలో ఉన్నా వాటిని కూడా ఆయా జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలు పంపాలని కోరుతున్నాను.

పింగళి, విశాఖ

Updated Date - 2021-04-20T06:08:19+05:30 IST