ప్రజల ప్రాణాలను తీస్తున్న పాలకుల నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2021-05-11T06:37:23+05:30 IST

దేశంలో పాలకుల నిర్లక్ష్యమే ప్రజల ప్రాణాలను బలికొంటోందని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ విమర్శించారు.

ప్రజల ప్రాణాలను తీస్తున్న పాలకుల నిర్లక్ష్యం
ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐ నాయకులు

కరోనా మరణాలు పెరుగుతున్నా.. పట్టనట్లుగా ప్రభుత్వాలు

సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ ధ్వజం

ప్రధాని దిష్టిబొమ్మ దహనం

అనంతపురం క్లాక్‌టవర్‌, మే 10 : దేశంలో పాలకుల నిర్లక్ష్యమే ప్రజల ప్రాణాలను బలికొంటోందని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ విమర్శించారు. కరోనా నియంత్రణ, వ్యాక్సిన్‌ సరఫరాలో పాలకుల నిర్లక్ష్యానికి నిరసనగా సోమవారం స్థానిక నీలం రాజశేఖర్‌రెడ్డి భవన్‌లో సీపీఐ నాయకుల ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భం గా జగదీష్‌ మాట్లాడుతూ కరోనా పట్ల ప్రధాని మోదీ, సీఎం జగన్‌ల నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు నిరసనలు చేపట్టామన్నారు. దేశంలో, రాష్ట్రంలో లక్షలాది కరోనా కేసులు, మరణాలు నమోదువుతున్నా పాలకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దా రుణమని మండిపడ్డారు. కరోనా విపత్తు మరింత జఠిలమయ్యే ప్రమాదముందని శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నా.. ఏమాత్రం ముంద స్తు చర్యలు చేపట్టకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యపు ధోరణి, ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపులు, అక్రమ కేసులతో బెదిరిస్తున్నాయని ధ్వజమెత్తారు. కొవిడ్‌ కేసులు, మరణాలను దాచిపెడుతూ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. కరోనా నివారణ, ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. వాస్తవాలను వెలికితీసి ప్రజలను అప్రమత్తం చేస్తూ, ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతున్న మీడియాపై ఆంక్షలు విధించడం అప్రజాస్వామికమని తీవ్రంగా ఖండించారు. సచివాలయ ఉద్యోగులకు కొవిడ్‌ విధు ల నుంచి మినహాయింపు ఇవ్వాలనీ, పారామెడికల్‌ సిబ్బందిని వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి మండలంలో కొవిడ్‌ సెంటర్‌ ఏ ర్పాటు చేసి, రోగులకు మెరుగైన వైద్య సేవలు, పౌష్టికాహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చొరవ చూపకపోతే ప్రజాప్రతినిధుల ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి పాలకుల మెడలు వంచుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కా ర్యదర్శి నారాయణస్వామి, నాయకులు శ్రీరాములు, అల్లీపీరా, రమణ య్య, ఏఐఐవెఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్‌, సంతో్‌షకుమార్‌, ఏ ఐఎ్‌సఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌, సీపీఐ నాయకులు బాలయ్య, సుందర్రాజు, చాంద్‌బాషా, సూరి, శ్రీనివాసులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-11T06:37:23+05:30 IST