ప్రభుత్వ ఫలాలు అర్హులకు అందేలా కృషి

ABN , First Publish Date - 2020-05-25T09:14:20+05:30 IST

ప్రభుత్వ ఫలాలు అర్హులకు అందేలా కృషి చేస్తానని నూతన జేసీ డా. ఏ. సిరి పేర్కొన్నారు.

ప్రభుత్వ ఫలాలు అర్హులకు అందేలా కృషి

సచివాలయాల జేసీ డా. సిరి 

బాధ్యతలు స్వీకరించిన నూతన జేసీ


అనంతపురం, మే 24 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఫలాలు అర్హులకు అందేలా కృషి చేస్తానని నూతన జేసీ డా. ఏ. సిరి పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవ స్థ జాయింట్‌ కలెక్టర్‌గా ఆమె ఆదివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ అందరి సహకారంతో నవరత్నా లు ఇతర ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేసి జిల్లా అభివృద్ధికి పాటుపడతానన్నారు. వార్డు, గ్రామ సచి వాలయం వలంటీర్ల పనితీరుపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తా నని తెలిపారు. తన పరిధిలో ఉన్న నవరత్నాల్లోని ప్రధాన అంశాలు సచివాలయ వ్యవస్థ, ఆరోగ్యం-కుటుంబ సంక్షే మం, పంచాయతీరాజ్‌, పాఠశాల, సాంకేతిక, ఉన్నత విద్య, పురపాలక శాఖ పరిపాలన, పట్టణాభివృద్ధి, హౌసింగ్‌, మీసేవ, ఆర్టీజీ, పీటీఈ-సి డిపార్ట్‌మెంట్‌, ఇంజనీరింగ్‌ శా ఖలకు సంబంధించి జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు, సూచనలతో ప్రభుత్వ పథకాలు వందశాతం అర్హులకు అందేలా పని  చేస్తానన్నారు.


జిల్లాలో ఉన్న 896 గ్రామ సచివాలయాలు, 311 వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన పౌరసేవలందించే క్రమంలో పటిష్టమైన చర్యలు తీసుకుం టామన్నారు. అనంతరం ఆమె జిల్లా కలెక్టర్‌ గంధం చం ద్రుడును మర్యాదపూర్వకంగా కలిశారు. జేసీ-2 రామ్మూర్తి, డీఆర్వో గాయిత్రిదేవి, జడ్పీ సీఈఓ శోభాస్వరూపరాణి, డీపీఓ రామనాథరెడ్డి, కలెక్టరేట్‌ ఏఓ విజయలక్ష్మి, అనంత పురం ఎంపీడీఓ భాస్కర్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీధర్‌ తో పాటు కలెక్టరేట్‌, సచివాలయ వ్యవస్థలోని పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నూతన జేసీని ఆమె చాంబర్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉం డగా జేసీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ ఏ. సిరి 2019 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారిణి. సొంత జిల్లా విశా ఖపట్నం. గతంలో ఈమె విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లో జేసీ-2గా పనిచేశారు. తాజాగా జాయింట్‌ కలెక్టర్‌ హోదా లో జిల్లాలో మొదటిసారిగా బాధ్యతలు స్వీకరించారు.

Updated Date - 2020-05-25T09:14:20+05:30 IST