పుష్యమాసం ఆదివాసులకు పవిత్రం

ABN , First Publish Date - 2022-01-24T04:56:37+05:30 IST

పుష్యమాసాన్ని ఆదివాసులు పవిత్రమాసంగా భావిస్తారు. కుమ్రం భీం జిల్లాలోని జంగాం జంగోలింగో సంఘటన ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక శివాలయం వద్ద ఉమ్మడి జిల్లాలోని వందలాది మంది జంగోలింగో దీక్ష పరులు తరలి రావడంతో ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన యశ్వంత్‌ మహరాజ్‌, వినాయక్‌ మహరాజ్‌, కిషన్‌ మహరాజ్‌, జైవంత్‌ మహరాజ్‌లే పాల్గొని మహయజ్ఞం నిర్వహించారు.

పుష్యమాసం ఆదివాసులకు పవిత్రం


ఉట్నూర్‌, జనవరి 23 : పుష్యమాసాన్ని ఆదివాసులు పవిత్రమాసంగా భావిస్తారు. కుమ్రం భీం జిల్లాలోని జంగాం జంగోలింగో సంఘటన ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక శివాలయం వద్ద ఉమ్మడి జిల్లాలోని వందలాది మంది  జంగోలింగో దీక్ష పరులు తరలి రావడంతో ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన యశ్వంత్‌ మహరాజ్‌, వినాయక్‌ మహరాజ్‌, కిషన్‌ మహరాజ్‌, జైవంత్‌ మహరాజ్‌లే పాల్గొని మహయజ్ఞం నిర్వహించారు. 31 రోజుల పాటు ఆదివాసీ గిరిజనులు భక్తి శ్రద్ధలతో జైజంగో, జైలింగో దీక్షలు నిర్వహిస్తూ మహాదేవున్ని  కొలుస్తుంటారు. ఈ సందర్భంగా నిర్వహించిన మహాదీక్షల యజ్ఞనికి కుమ్రం భీం జిల్లా ఆసిఫాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పవిత్ర పుష్పమాసంలో ఆదివాసీ గిరిజనులు తమ కుల దైవాలతో పాటు ఆదివాసీ దేవతలకు పూజలు నిర్వహించడం ఆధునికంగా వస్తున్న సంప్రదాయమని అన్నారు. 31 రోజుల పాటు పాద రక్షలు లేకుండా జై జంగో, జైలింగో దీక్షలను పవిత్రంగా కొనసాగించడం వెనుక ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కాంక్షించడమే అన్నారు. కార్యక్రమంలో ఏటీడబ్ల్యూ ఏసీ చైర్మన్‌ లక్కెరావు, ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, పెందూర్‌ ప్రభాకర్‌, పుర్కబాపురావు, పుష్పరాణీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T04:56:37+05:30 IST