Abn logo
Oct 24 2021 @ 22:50PM

రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరుతున్న పలువురు నాయకులు

డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి

ములుగు, అక్టోబరు 24 : వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రమైన ములుగు కాంగ్రెస్‌ కార్యాలయం వద్ద సింగన్నగూడెం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నర్సారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివా్‌సగుప్తా, రవీందర్‌ సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ గ్రామ అధ్యక్షుడు ముత్యాలు, వెంకటేశం, ప్రకాష్‌, నరేందర్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, మధు పాల్గొన్నారు.