శుభారంభం..14,000 ఎగువన ముగిసిన నిఫ్టీ

ABN , First Publish Date - 2021-01-02T06:53:46+05:30 IST

కొత్త ఏడాది ఆరంభం రోజున కూడా దేశీయ స్టాక్‌ మార్కెట్లలో రికార్డుల హోరు కొనసాగింది. జనవరి 1న సెన్సె క్స్‌. నిఫ్టీ మరో జీవితకాల గరిష్ఠ స్థాయిలో ముగిశాయి

శుభారంభం..14,000 ఎగువన ముగిసిన నిఫ్టీ

కొత్త ఏడాది ఆరంభం రోజున కూడా దేశీయ స్టాక్‌ మార్కెట్లలో రికార్డుల హోరు కొనసాగింది. జనవరి 1న సెన్సె క్స్‌. నిఫ్టీ మరో జీవితకాల గరిష్ఠ స్థాయిలో ముగిశాయి. కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్‌ 117.95 పాయింట్ల లాభంతో 47,868.98 పాయింట్ల వద్ద ముగియగా నిఫ్టీ 36.75 పాయిం ట్ల లాభంతో 14,018.50 పాయింట్ల వద్ద క్లోజైంది. డిసెంబరు నెల జీఎ్‌సటీ వసూళ్లు రికార్డు స్థాయికి చేరడం, ఆటోమొబైల్‌ విక్రయాలు సానుకూలంగా ఉండటం మార్కెట్‌ జోరుకు కారణాలుగా ఉన్నాయి. అయితే బ్యాంకింగ్‌ షేర్లలో మాత్రమే కొద్దిపాటి లాభాల స్వీకరణ కనిపించింది. 

 

30 శాతం ప్రీమియంతో ఆంటోని వేస్ట్‌ లిస్టింగ్‌: ఇటీవల పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన ఆంటోని వేస్ట్‌ హ్యాండ్లింగ్‌ సెల్‌ శుక్రవారం 30 శాతం ప్రీమియంతో స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయ్యింది. రూ.315 ధరతో ఆంటోనీ వేస్ట్‌.. పబ్లిక్‌ ఇష్యూకు రాగా 36.50 శాతం ప్రీమియంతో రూ.430 ధరతో లిస్ట్‌ అయి ఇన్వెస్టర్లకు తొలిరోజే లాభాలను పంచింది. ఇంట్రాడేలో ఒక దశలో 56.42 శా తం లాభంతో రూ.492.75 స్థాయిని తాకింది. చివరకు 29.28 శాతం లాభంతో రూ.407.25 వద్ద క్లోజైంది. 


52 వారాల గరిష్ఠానికి రెయిన్‌ ఇండస్ట్రీస్‌ షేరు: హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న రెయిన్‌ ఇండస్ట్రీస్‌ షేరు శుక్రవారం హాట్‌హాట్‌గా ట్రేడైంది. బీఎ్‌సఈలో రూ.129.90 వద్ద ప్రారంభమైన కంపెనీ షేరు ఒక దశలో 52 వారాల గరిష్ఠ స్థాయి అయిన రూ.148.85ని తాకింది. చివరకు 13.99 శాతం లాభంతో రూ.144.20 వద్ద స్థిరపడింది. అమెరికా, కెనడాల్లోని రెండు కీలకేతర అనుబంధ కంపెనీలను రూ.637 కోట్లకు విక్రయించటం పూర్తయినట్లు కంపెనీ ప్రకటించడమే షేరు జోరుకు కారణం.  


రూ.లక్ష కోట్లకు బజాజ్‌ ఆటో మార్కెట్‌ క్యాప్‌: శుక్రవారం బజాజ్‌ ఆటో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.లక్ష కోట్ల (1,360 కోట్ల డాలర్లు) మార్కును అధిగమించింది. అంతర్జాతీయంగా ఒక ద్విచక్ర వాహన కంపెనీ ఈ మార్కును చేరుకోవటం ఇదే తొలిసారని పేర్కొంది. శుక్రవారం ఎన్‌ఎ్‌సఈలో కంపెనీ షేరు రూ.3,479 వద్ద క్లోజవటంతో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1,00,670.76 కోట్లకు చేరిందని తెలిపింది. 

Updated Date - 2021-01-02T06:53:46+05:30 IST