సలసల కాగుతున్న నూనె

ABN , First Publish Date - 2020-09-18T11:08:16+05:30 IST

కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల సామా న్య, మధ్యతరగతి వర్గాలకు పెనుభారంగా మారింది. ఇటీ వల నిత్యావసర వస్తువుల్లో ప్రధా

సలసల కాగుతున్న నూనె

  మూడు రోజుల్లో ధరలు పైపైకి

 కిలోపై రూ. 25కి పైగా పెరుగుదల

  వినియోగదారుల్లో ఆందోళన 


హిందూపురం, సెప్టెంబరు 17 : కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల సామా న్య, మధ్యతరగతి వర్గాలకు పెనుభారంగా మారింది. ఇటీ వల నిత్యావసర వస్తువుల్లో ప్రధానమైన నూనె ధరలు వినియోగదారుల్ని హడలెత్తిస్తోంది. మూడు రోజుల నుంచి అన్ని రకాల నూనె లు కిలోపై రూ. 15 నుంచి రూ.30 వరకు పెంచేశారు. నూనెలను ఉత్పత్తి చేస్తున్న కంపెనీల తోపాటు హోల్‌సేల్‌ డీలర్ల వద్దే ధరలు పెరిగినట్లు రిటైల్‌ వ్యాపారులు చెబుతున్నారు. హిందూపురంలో లాక్‌డౌన్‌ సడలింపు తరువాత రిటైల్‌లో పామాయిల్‌ కిలో రూ. 75 ఉండగా ప్రసుత్తం రూ. 90కి పెరిగింది.


సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ. 108 నుంచి రూ. 125, వేరుశనగ నూనె 155 నుంచి రూ. 190కి పెరిగింది. మార్చిలో లాక్‌డౌన్‌ మునుపు పా మాయిల్‌ కిలో రూ. 65, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ. 90, వేరు శనగ రూ. 150లోపే ఉండేది.  ఆరు నెలల్లో పామాయిల్‌ కిలోపై రూ. 25, సన్‌ఫ్లవర్‌ రూ. 35, వేరుశనగ రూ. 35 పెరిగింది. మార్కెట్‌లో అన్నిరకాల నూనెల సరఫరా తగ్గుదలతో హోల్‌సేల్‌ డీలర్లే ధరలు పెంచినట్లు రిటైల్‌ వ్యాపారులు చెబుతున్నారు. ప్రధానంగా దేశ, విదేశాల్లో సన్‌ఫ్లవర్‌ పంటపై మిడతల దాడులు, విదేశాల నుంచి దిగుబడులు, దిగుమతులు తగ్గడంతో నూనె ధరలు పెరి గినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. 


డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో జిల్లాలో నూనెల కొరత ఉన్న ట్లు వ్యాపారులు అంటున్నారు.  నూనెలేనిదే ముద్దదిగద ని,  ధరలు పెరిగినా, భారమైన కొనుగోలు చేయాల్సివ స్తోందని వినియోగదారులు వాపోతున్నారు. కొందరు వ్యా పారులు కృతిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నా నియంత్రించాల్సిన అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో వినియోదారులు ఆందోళన చెందాల్సివస్తోంది. కరోనాతో నష్టపోయి ఉన్న అన్ని వర్గాల ప్రజలకు నూనెల ధరల పెరుగుదల పెనుభారంగా మారింది. 

Updated Date - 2020-09-18T11:08:16+05:30 IST