పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి

ABN , First Publish Date - 2022-09-02T05:44:02+05:30 IST

ప్రభుత్వం సీపీఎస్‌ విధా నాన్ని రద్దు చేసి పాతపెన్షన్‌ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఉపాధ్యా య సంఘాల పోరాట కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు.

పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి
కలెక్టర్‌ వెంకట్‌రావుకు వినతిపత్రం ఇస్తున్న పీఆర్టీయూ నాయకులు

- ఉపాధ్యాయ సఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, సెప్టెంబరు 1 : ప్రభుత్వం సీపీఎస్‌  విధా నాన్ని రద్దు చేసి పాతపెన్షన్‌ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఉపాధ్యా య సంఘాల పోరాట కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు వెంకటేష్‌, ఆదిత్య, రవికుమార్‌, కిష్ణప్ప, దూమర్ల నిరంజన్‌, వెంకటేశ్వర్లు, మహముద్‌ తదితరులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. 2004 సెప్టెంబరు 1 నుంచి సీపీఎస్‌ అమలు చేసిందని, దీన్ని నిరసిస్తూ సెప్టెంబరు 1ని విద్రోహదినంగా పాటిస్తున్నట్లు తెలిపారు. పాత పెన్షన్‌ విదానం అమలు చేసే వరకు పోరాటం ఆగదన్నారు. అనంతరం కలెక్టరేట్‌కు వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఇదే అంశంపై పీఆర్టీయూ ఆధ్వర్యంలోనూ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ గౌడ్‌, రఘురామ్‌ రెడ్డి, గౌరవ అఽధ్యక్షుడు గోపాల్‌ నాయక్‌ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నా యకులు బుచ్చారెడ్డి, రాజశేఖర్‌గౌడ్‌, అశ్విని చంద్రశేఖర్‌, హరినాథ్‌,  వైవీరావు, కృష్ణయ్య, విజయ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా మహమ్మదాబాద్‌, గండీడ్‌ మండల కేంద్రాలలో పీఆర్టీయూ నాయకులు తహసీల్దార్‌కు వినతి పత్రం అందజే శారు. కారక్రమంలో  మహమ్మదాబాద్‌ మండల అధ్యక్ష,, కార్యదర్శులు విజయా నంద్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, జైపాల్‌రెడ్డి, వేణుగోపాల్‌, ఓంప్రకాష్‌, గీత పాల్గొన్నారు.

అడ్డాకుల  : పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని ఉపాధ్యాయులు తహసీల్దార్‌ కిషన్‌కు వినతిపత్రం అందజేశారు.  కార్యక్రమంలో టీటీయూ జిల్లా అధ్యక్షుడు జుర్రు నారాయణ యాదవ్‌, ఆర్‌యూపీపీ జిల్లా అధ్యక్షుడు రాకేశ్‌, టీపీయూఎస్‌ మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్‌, బీటీఏ జిల్లా బాధ్యుడు బాలశంకర్‌, బీటీఏ జిల్లా అధ్యక్షుడు బాలశంకర్‌, యూటీఎఫ్‌ బాధ్యుడు రాములు, ప్రధానోపాధ్యాయుడు ఉమాపతిరెడ్డి, రూప్‌ బాధ్యుడు బాలరాంగౌడ్‌, పీడీ అంజిలయ్య పాల్గొన్నారు.

ఫ మిడ్జిల్‌ : మిడ్జిల్‌లోనూ తహసీల్దార్‌ శ్రీనివాసులుకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు మోహన్‌, వెంకటేశ్వర్‌రెడ్డి ఉన్నారు.

హన్వాడ : హన్వాడలో ఉపాధ్యాయులు తహసీల్దార్‌ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు మదన్‌, ప్రధాన కార్యదర్శి స్వామి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెంకటయ్య, విజయభాస్కర్‌, కృష్ణారెడ్డి, మీనాక్ష్మీ, సుజిత్‌ కుమార్‌, రెహన పర్వీన్‌, శ్రీనివాస్‌, ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-02T05:44:02+05:30 IST