కొనసాగుతున్న కరోనా బంద్‌

ABN , First Publish Date - 2020-03-24T12:46:28+05:30 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలు పు మేరకు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో బంద్‌

కొనసాగుతున్న కరోనా బంద్‌

పెన్‌గంగా వద్ద భారీగా ఆగిన లారీలు

పరిస్థితిని సమీక్షిస్తున్న పోలీసులు

వాహనదారులకు పోలీసుల అవగాహన


ఆదిలాబాద్‌టౌన్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలు పు మేరకు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో బంద్‌ కొనసాగు తోంది. మొదటిరోజు ప్రధానమంత్రి పిలుపుతో జనతా కర్ఫ్యూతో రోడ్లన్ని నిర్మానుషంగా మారగా రెండోరోజు సో మవారం కరోనా బంద్‌ కనిపించింది. అయితే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరాలకు మినహాయింపు ఇవ్వడంతో కిరాణా దుకాణాలు, సూపర్‌ మార్కెట్‌లు, కూరగాయల మార్కెట్లు, రైతుబజార్‌లు అక్కడక్కడ తెరుచుకున్నాయి. 


దీంతో ప్రజలు వారానికి సరిపడ సరుకులను కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు బారులు తీరారు. పట్టణంలోని ప్రధానచౌక్‌ల్లో మాత్రం వ్యాపార సముదాయాలు తెరు చుకోకపోవడంతో ఉదయం నిర్మానుషంగా కనిపించిన రో డ్లన్నీ మధ్యాహ్నం వరకు కొంత సందడిగా కనిపించింది. ద్విచక్ర వాహనదారులు, ప్రజలు వారి అవసరాల నిమి త్తం నిత్యావసర సరుకులు, కూరగాయాల కోసం పట్టణా నికి రావడంతో రోడ్లు జనంతో సందడిగా కనిపించాయి. ఇదిలా ఉంటే పోలీసులు మాత్రం ఇతర వాహనాలను రోడ్ల పైకి రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో రోడ్ల పై సంచరించడానికి అవకాశం లేదని మాస్కులు తప్పని సరిగా ధరించాలని వాహనదారులకు ఎక్కడికక్కడ నిలిపి వేశారు.


అయితే కిరాణా దుకాణాలకు, సూపర్‌ మార్కెట్‌లకు వచ్చిన విని యోగదారులకు మాస్కులు లేనిదే సరుకులు విక్రయి ంచేది లేదని వ్యాపారస్థులు తేల్చి చెప్పారు.దీంతో మా స్కులు ఉన్న వారికి మాత్రమే ఉదయం ఆయా ప్రధాన చౌక్‌లోని సూపర్‌ మార్కెట్లు దుకాణాలలో సరుకులు విక్రయించడంతో మిగితావారు ఇళ్లకు బయలు దేరారు. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు ఆయా దు కాణాలకు కొంత మినహాయింపు ఇవ్వడంతో ప్రజలు క్యూలో నిలబడి సరుకులను కొనుగోలు చేశారు. కాగా కరోనా వైరస్‌ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందని సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండడం, వైరస్‌ భయంతో జ నం బయటకు వెళ్లకపోవడంతో ప్రధాన చౌక్‌ల్లో ప్రాం తాలన్నీ నిర్మానుషంగా మారాయి.


Updated Date - 2020-03-24T12:46:28+05:30 IST