Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోడు భూముల ఆన్‌లైన్‌ ప్రక్రియ వేగవంతం చేయాలి

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

జైనూరు, నవంబరు 29: పోడు భూముల ఆన్‌లైన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. మండల తహసీల్దార్‌ కారాలయ్యాన్ని సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పలురికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ మాట్లాడుతూ రైతులు ఇది వరకే పోడు భూములకు సంబంధించిన వివరాలను దరఖాస్తుల ద్వారా తెలియపరిచారన్నారు. ఈ దరఖాస్తుల ఆన్‌లైన్‌, కంప్యూటరీకరణ ప్రక్రియను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్టీలకు చెందిన 1057, ఇతరులకు సంబంధించిన 1969 దర ఖాస్తులు పోడుభూముల పరిష్కారం కింద వచ్చా యని తెలిపారు. కల్యాణ లక్ష్మికింద దరఖాస్తులు చేసి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆర్థికసాయం మంజూ రుకాలేదని లబ్ధిదారులు కలెక్టర్‌తో పేర్కొన్నారు. దీంతో వెంటనే ఆర్డీవోతో మాట్లాడి కల్యాణ లక్ష్మి సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఆనంతరం ప్రజలిచ్చిన దరఖాస్తులను పరిశీ లించారు. తహసీల్దార్‌ సాయన్న, ఎంపీడీవో ప్రభు దయ, ఆర్‌ఐ లీలాబాయి, సిబ్బంది పాల్గొన్నారు.

కెరమెరి: పోడు రైతుల దరఖాస్తులను త్వరగా ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం ఆయన కెరమెరి తహసీల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీచేశారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ అర్హతకలిగిన ప్రతిరైతుకి పట్టాను అందిస్తామని అన్నారు. తహ సీల్దార్‌ సమీర్‌ హైమద్‌ఖాన్‌, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

వేగవంతం చేయాలి..

- అదనపు కలెక్టర్‌ రాజేశం

బెజ్జూరు: పోడు భూముల కోసం దరఖాస్తులు చేసుకున్న రైతుల వివ రాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అదనపుకలెక్టర్‌ రాజేశం అన్నారు. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌ ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. రైతుల వివరాలు నమోదు చేయడంతోపాటు ధ్రువీకరణ పత్రాల జారీ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తహ సీల్దార్‌ రఘునాథ్‌రావును ఆదేశించారు. ఆర్డీవో చిత్రు, ఎంపీవో రమేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ఎయిడ్స్‌కు నివారణ ఒక్కటే మార్గం..

- కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ఆసిఫాబాద్‌: ఎయిడ్స్‌కు చికిత్స లేదని నివారణ ఒక్కటే మార్గమని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. డిసెంబరు1న ఎయిడ్స్‌ దినోత్సవంను పురస్కరించు కుని సోమవారం తన కార్యాలయంలో ఎయిడ్స్‌ వ్యాది దినోత్సవ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 2002నుంచి 2021అక్టోబరు వరకు మొత్తం 710కేసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ సంవత్సరంలో 27మందిని గుర్తించినట్లు తెలిపారు. ఏఆర్టీ మందులు వాడుతున్న వారు362మంది ఉన్నా రని, ప్రతినెల రెండువేల చొప్పున ఆసరాపింఛన్‌ తీసు కునే వారు 144మంది ఉన్నారని తెలిపారు. ఎయిడ్స్‌ రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌ నాయక్‌, జిల్లా ఇన్‌చార్జి సీతారాం, సిబ్బంది రమేష్‌, హరీష్‌, సతీష్‌, రఫీ పాల్గొన్నారు.

Advertisement
Advertisement