కలసి కదలడమే మార్గమని!

ABN , First Publish Date - 2021-06-24T05:04:51+05:30 IST

తమ పంచాయతీకి రోడ్డు వేయాలని ఎందరినో వేడుకున్నారు. ఎన్నో వినతులు ఇచ్చారు. కానీ వారి గోడు విన్నవారే లేరు. కష్టం వస్తే డోలీలోనే నేటికీ తరలించడం వారిని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఎవరికి చెప్పినా ఉపయోగం లేకపోవడంతో తమ గ్రామాలకు తామే రోడ్డు నిర్మించుకోవాలని నిర్ణయించారు.

కలసి కదలడమే మార్గమని!
దారపర్తి పంచాయతీకి రోడ్డు నిర్మాణం

14 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం

దారపర్తి గిరిజనం సాహసం

శృంగవరపకోట రూరల్‌, జూన్‌ 23 : తమ పంచాయతీకి రోడ్డు వేయాలని ఎందరినో వేడుకున్నారు. ఎన్నో వినతులు ఇచ్చారు.   కానీ వారి గోడు విన్నవారే లేరు. కష్టం వస్తే డోలీలోనే నేటికీ తరలించడం వారిని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఎవరికి చెప్పినా ఉపయోగం లేకపోవడంతో తమ గ్రామాలకు తామే రోడ్డు నిర్మించుకోవాలని నిర్ణయించారు. అందరూ ఐకమత్యంతో పలూగూ పారలు చేతబట్టారు. తమ పంచాయతీకి రోడ్డు వేసుకునేందుకు చేయిచేయి కలిపారు. చురుగ్గా రోడ్డు నిర్మించుకుంటున్నారు. మండలంలోని దారపర్తి పంచాయతీ గిరిజనుల ఆదర్శాన్ని అందరూ కొనియాడుతున్నారు. 19 గ్రామాల ప్రజల వ్యధను తీర్చేందుకు వారంతా కంకణం కట్టుకుని కొద్దిరోజులుగా పనిచేస్తున్నారు. 



Updated Date - 2021-06-24T05:04:51+05:30 IST