Advertisement
Advertisement
Abn logo
Advertisement

పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి


అరకులోయ, నవంబరు 30: అరకులోయకు వచ్చే పర్యాటకులకు ఘాట్‌రోడ్డులో కాఫీ, మిరియాల వృక్షాలు స్వాగతం పలుకుతుండగా.. కొండలు, లోయలు, వలిసె పూల అందాలు కనువిందుజేస్తున్నాయి. కార్తీకమాసం సందడి అరకులోయ ప్రాంతంలో కొనసాగుతునే ఉంది. అరకులోయకు వచ్చే పర్యాటకులు మార్గమధ్యంలో గాలికొండ వ్యూపాయింట్‌ను, కాఫీ తోటలను సందర్శిస్తూ రోడ్డు పక్కన ఉన్న వలిసెపూల తోటల్లో ఫొటోలు దిగుతూ సందడిగా కనిపించారు. పద్మాపురం గార్డెన్‌, మ్యూజియం కిటకిటలాడాయి.

పాడేరు మండలంలోని వంజంగి మేఘాల కొండ వద్ద మంచు అందాలను తిలకించేందుకు పర్యాటకులు అధికంగా తరలి వస్తున్నారు. గతంలో పర్యాటకులు శని, ఆదివారాల్లో మాత్రమే ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఉండేది. ప్రస్తుతం ప్రతీరోజు సాయంత్రమే మేఘాల కొండపైకి చేరుకుంటున్నారు.  


Advertisement
Advertisement