ఐటీకి అవకాశాలు అపారం

ABN , First Publish Date - 2021-04-10T06:40:04+05:30 IST

కొవిడ్‌, అనంతర పరిణామాల నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ రంగానికి డిజిటలీకరణ అపార అవకాశాలను అందిస్తోంది. కృత్రిమ మేధ, ఐఓటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో డిజిటలీకరణ చేయని పరిశ్రమ లేదని

ఐటీకి అవకాశాలు అపారం

చిన్న కంపెనీలకు ఊతమివ్వాలి 

ఊపందుకున్న డిజిటలీకరణ

హైసియా ‘బిజ్‌సమ్మిట్‌’లో నిపుణులు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌, అనంతర పరిణామాల నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ రంగానికి డిజిటలీకరణ అపార అవకాశాలను అందిస్తోంది. కృత్రిమ మేధ, ఐఓటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో డిజిటలీకరణ చేయని పరిశ్రమ లేదని సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నారు. గతంలో వై2కే సమస్య భారత సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమకు భారీ అవకాశాలను అందించింది. పరిశ్రమ కొత్త మలుపు తిరిగేందుకు దోహదపడింది. ఇప్పుడు కొవిడ్‌ అంతకంటే ఎక్కువగా వందింతల అవకాశాలను కల్పించనుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) నిర్వహించిన ‘బిజ్‌సమ్మిట్‌’ పరిశ్రమ ప్రతినిధులు మాట్లాడారు. వ్యాక్సిన్‌తో పాటు డిజిటల్‌ టెక్నాలజీలను వినియోగించి కొవిడ్‌ రెండో దశ విజృంభణను అరికట్టవచ్చని కాగ్నిజెంట్‌ ఇండియా చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ నంబియార్‌ తెలిపారు. వై2కే కంటే వందింతల అవకాశాలను కొవిడ్‌ పరిశ్రమకు తీసుకురాగలదని తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, నంబియార్‌  అభిప్రాయపడ్డారు. 


చిన్న కంపెనీలే కీలకం

దేశంలో ఐటీ రంగంలో 16,000 చిన్న కంపెనీ లు ఉన్నాయని.. తెలంగాణలో 1500-1600 కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని హైసి యా వైస్‌ ప్రెసిడెండ్‌ కిరణ్‌ చెరుకూరి తెలిపారు. తెలంగాణ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో 20 శాతం చిన్న కంపెనీలదేనని.. దాదాపు 30 శాతం ఉద్యోగావకాశాలను ఇవే కల్పిస్తున్నాయని చెప్పారు. ఐటీ రంగంలో 65 శాతం వ్యయాలు వేతన చెల్లింపుల రూపంలో ఉంటుందని, చిన్న కంపెనీలకు రిస్క్‌ కేపిటల్‌ను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఐటీ పరిశ్రమకు మూలం చిన్న, మధ్య స్థాయి కంపెనీలేనని జయేశ్‌ రంజన్‌ పేర్కొన్నారు. బ్లాక్‌ చెయిన్‌ వంటి కొత్త టెక్నాలజీల్లో అపార అవకాశాలు ఉన్నాయ ని వాటిని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించాలన్నారు. 


డిజిటల్‌ సర్వీసెస్‌, డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, డిజిటల్‌ ట్రస్ట్‌, ఎమర్జింగ్‌ టెక్నాలజీ ద్వారా డిజిటల్‌ ఇండియాను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోందని ఎలకా్ట్రనిక్స్‌ ఐటీ శాఖ జాయింట్‌ సెక్రటరీ సౌరభ్‌ గౌర్‌ తెలిపారు. 

Updated Date - 2021-04-10T06:40:04+05:30 IST