Abn logo
Sep 23 2021 @ 00:35AM

అణగారిన కులాలు ఒక్కటవ్వాలి

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కన్వీనర్‌ సదయ్య

- ఆల్‌ ఇండియా అంబేద్కర్‌ సంఘం జిల్లా కన్వీనర్‌ సదయ్య

ఓదెల, సెప్టెంబరు 22 : డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కలలు సాకారం కావాలంటే అణగారిన కులాలన్నీ ఒక్కటవ్వాలని ఆల్‌ ఇండియా అంబేద్కర్‌ సంఘం జిల్లా కన్వీనర్‌ లంక సదయ్య అన్నారు. మండల కేం ద్రంలో బుధవారం ఆల్‌ ఇండియా అంబేద్కర్‌ సం ఘం జిల్లా స్థాయి సమావేశాన్ని అంబాల కొముర య్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్‌ సంఘం పటిష్టంగా ఉండా లంటే ఎవరు కూడా డబ్బుకు అమ్ముడుపోవద్దని, ఈ సంఽఘం ఏ ఒక్క కులానికి చెందింది కాదని, కుల, మత, రాజకీయలకతీతంగా వ్యవహరించడమే లక్ష్య మన్నారు. కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, బోంకూరి మఽధు మాట్లాడు తూ అణగారిన కులాలకు హక్కుల దక్కాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తన న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశాడని, రాజ్యాంగంలోని ఫలాలు దక్కా లని అంబేద్కర్‌ నమ్ముకుంటే ప్రస్తుతం అమలుకావ డం లేదన్నారు. జడ్పీటీసీ గంట రాములు, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్‌, ఓయూ ప్రొఫెసర్‌ సంపత్‌ మాట్లాడుతూ ప్రస్తుతం రాజ్యాంగంలో ఒకే ఓటు రిజర్వేషన్‌లు మాత్రమే సమానత్వం ఉందని, 85 శాతం ఎస్‌టీ, ఎస్‌సీ, బీసీ, మైనార్టిలుంటే కనీసం 50శాతం కూడా రిజర్వేషన్‌ అమలుకావడం లేదన్నా రు. అంబేద్కర్‌, జ్యోతిబా ఫూలే సంస్కరణలు, ఆశ యాల వల్లనే దళితులకు సంక్షేమ ఫలాలు, రాజకీ యాల్లో, ఉద్యోగ, విద్యులో ఉన్నత పదవులు దక్కుతు న్నాయన్నారు. అంతకుముందు అంబేద్కర్‌ జన్మస్థ లం మౌ పట్టణం నుంచి తెచ్చిన మట్టిని స్థానిక అం బేద్కర్‌విగ్రహం పాదాలపై పోసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మధ్యల నర్సయ్య, మాటూరి రాజ రత్నం, కొంకటి లక్ష్మణ్‌, కాంపెల్లి సతీష్‌, మంతెన లిం గయ్య, ఆకుల మహేందర్‌, బోడకుంట స్వామి, తి ప్పారపు చిరంజీవి,అంబాల శ్రీనివాస్‌, మండలంలోని వివిధ కులాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.