యజమాని తిరిగొస్తుందని..

ABN , First Publish Date - 2021-06-23T09:06:38+05:30 IST

ఇన్నాళ్లూ చేరదీసి తోడుగా ఉన్న యజమాని చనిపోవడాన్ని ఓ శునకం జీర్ణించుకోలేక పోతోంది. ఆమె తిరిగొస్తుందన్న ఆశతో మూడు రోజులుగా సమాధి వద్దే నిరీక్షిస్తోంది

యజమాని తిరిగొస్తుందని..

మూడు రోజులుగా సమాధి వద్దే శునకం నిరీక్షణ


బేస్తవారపేట, జూలై 22: ఇన్నాళ్లూ చేరదీసి తోడుగా ఉన్న యజమాని చనిపోవడాన్ని ఓ శునకం జీర్ణించుకోలేక పోతోంది. ఆమె తిరిగొస్తుందన్న ఆశతో మూడు రోజులుగా సమాధి వద్దే నిరీక్షిస్తోంది. ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలం పచ్చర్ల వెంకటాపురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి (80) భర్త దశాబ్దం క్రితమే మృతి చెందాడు. ఆమె ముగ్గురు కుమారులు గిద్దలూరుకు వలస వెళ్లి కూలి పనులు చేసుకొని జీవిస్తున్నారు. లక్ష్మీదేవి గ్రామంలోని పూరిగుడిసెలో ఒంటరిగా ఉంటోంది. ఓ కుక్కను చేరదీసి వండుకున్న దాంట్లో కాస్త దానికి పెట్టేది. దీంతో అది ఆ ఇంటిని వదలకుండా లక్ష్మీదేవిని కనిపెట్టుకొని ఉండేది. ఇటీవల అనారోగ్యానికి గురైన లక్ష్మీదేవి ఆదివారం మృతి చెందింది. ఆమె కుమారులు వచ్చి అంత్యక్రియలు నిర్వహించి వెళ్లారు. ఆ కుక్క మాత్రం మూడు రోజులుగా ఖననం చేసిన ప్రాంతం వద్దే తిరుగుతూ ఆమె కోసం ఎదురు చూస్తోంది.

Updated Date - 2021-06-23T09:06:38+05:30 IST