ఓజోన్‌ పొరను పరిరక్షించాలి

ABN , First Publish Date - 2020-09-17T12:11:18+05:30 IST

ఓజోన్‌ పొరను పరిరక్షించుకోవల్సి ఉందని, ప్రపంచంలో 197 దేశా లు ఈ పొరను రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయని కాలుష్య నియం త్రణ మండలి ప్రాంతీయ అధికారి

ఓజోన్‌ పొరను పరిరక్షించాలి

ఎచ్చెర్ల: ఓజోన్‌ పొరను పరిరక్షించుకోవల్సి ఉందని, ప్రపంచంలో 197 దేశా లు ఈ పొరను రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయని కాలుష్య నియం త్రణ మండలి ప్రాంతీయ అధికారి శంకరనాయక్‌ అన్నారు. ప్రపంచ ఓజోన్‌ దినోత్సవం సందర్భంగా బుధవారం కాలుష్య నియంత్రణ మండలి, ఎన్‌ఏసీఎల్‌ ఇండస్ట్రీస్‌ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.


ఓజోన్‌ పొరకు నష్టం కలిగే వస్తువుల వినియోగం తగ్గించాల న్నారు. అంబేడ్కర్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.రఘుబాబు మాట్లాడుతూ ఓజోన్‌ పొర ఓ గొడుగులా ఉపయోగపడుతుందని, దీనిని పరిరక్షించే బాధ్యతను అందరూ స్వీకరించాలన్నారు. ఎన్‌ఏసీఎల్‌ ఇండస్ట్రీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సీవీ రాజులు మాట్లాడుతూ, ఓజోన్‌ పొరను పరిరక్షించకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు ఏర్పడ తాయన్నారు. ఈ సందర్భంగా చిలకపాలెం జంక్షన్‌ నుంచి అంబేడ్కర్‌ వర్సిటీ వరకు ర్యాలీ నిర్వహించారు. వర్సిటీ ప్రాంగణంలో 100 మొక్కలు నాటారు. 

Updated Date - 2020-09-17T12:11:18+05:30 IST