Abn logo
Sep 28 2021 @ 00:42AM

భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

వీడియో కాన్ఫరెన్సలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి

అనంతపురం,సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు.  సోమవారం ఆమె కలెక్టరేట్‌ నుంచి ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల స్పెషలాఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. జేసీలు నిశాంతకుమార్‌, నిశాంతి, గంగాధార్‌ గౌడ్‌లతో కలిసి సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్స్‌ భవనాల పూర్తి, వైఎస్సార్‌ అర్బన క్లినిక్‌లు, గ్రామ, వార్డు సచి వాలయాల తనిఖీ, ఇళ్ల గ్రౌండింగ్‌, 90 రోజుల్లో ఇంటి ప ట్టాల పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉపాధి పథకం కింద చేపడుతున్న గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్స్‌ నిర్మాణాలు పెండింగ్‌లో ఉంచకుండా ప్రతివారం ఒక స్టేజ్‌ మారేలా వేగంగా నిర్మాణాలు చేపట్టాలన్నారు. డిజిటల్‌ లైబ్రరీలకు సం బంధించి స్థల సేకరణ సమస్యను తొలగించి గ్రౌండింగ్‌ ప్రక్రియను సీరియ్‌సగా చేపట్టాలన్నారు. అక్టోబరు 1వ తేదీన ఆప్షన వన, టూ, త్రీ కింద  ఇళ్ల గ్రౌండింగ్‌ చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతిరోజూ బయోమెట్రిక్‌ అటెండెన్స వేయాలన్నారు. ఎనర్జీ అసిస్టెంట్లు కూడా అటెండెన్స తప్పనిసరిగా వేయాలన్నారు. కరోనా నేపథ్యంలో వ్యాక్సినేషనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ వీడి యో కాన్ఫరెన్సలో సీపీఓ ప్రేమచంద్ర, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ భాగ్యరాజ్‌, హౌసింగ్‌ పీడీ కేశవనాయుడు, జిల్లా పరిషత సీఈఓ భాస్కర్‌రెడ్డి, డ్వామా పీడీ వేణుగోపాల్‌ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి, మెప్మా పీడీ రమణా రెడ్డి, డీ ఎంహెచఓ కామేశ్వర ప్రసాద్‌, ప్రభుత్వ వైద్య కళా శాల ప్రిన్సిపాల్‌ నీరజ, వ్యవసాయ శాఖ జేడీ చంద్రనాయక్‌, డీటీడబ్ల్యూఓ అన్నాదొర, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ శ్రీనాథరెడ్డి, బీసీ కార్పొరేషన ఈడీ నాగముని, హార్టికల్చర్‌ డీడీ పద్మలత, డీపీఓ పార్వతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


కోర్టు కేసులు ధిక్కరణ స్థాయికి వెళ్లరాదు

కోర్టు కేసులు ధిక్కరణ స్థాయికి వెళ్లరాదని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె రెవెన్యూభవన నుంచి పలు శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హైకోర్టు, ఇతర కోర్టు కేసులకు సంబంధించి నిర్దేశిత గడువులోగా కౌంటర్లు, అఫిడవిట్లు  దాఖలు చేయాలన్నారు. కోర్టు ఆదేశాల మేరకు తగు చ ర్యలు తీసుకొని ఆధారాలతో సమర్పించాలన్నారు. ప్రతి మాసం పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులకు సంబంధించి సమీక్షిస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మానవహక్కుల కమిషన, లోకాయుక్తల నుంచి అందే పిటీషన్లపై అధికారులు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల వివరాలను బుధవారంలోపు డీఆర్‌ఓకు సమర్పించాలన్నారు. కార్యక్ర మంలో జేసీలు నిశాంతకుమార్‌, గంగాధర్‌ గౌడ్‌, అసి స్టెంట్‌ కలెక్టర్‌ సూర్యతేజ, డీఆర్వో గాయత్రీదేవి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాసులు, ఆర్డీఓ మధుసూదనతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.