మహమ్మారి విలయతాండవం

ABN , First Publish Date - 2022-01-23T06:45:15+05:30 IST

జిల్లాలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. శనివారం ఒక్క రోజే 500పైగా కేసు లు నమోదు కావడం ఇందుకు నిదర్శనం. కాగా, జిల్లాలో జరుగుతున్న ఫీవర్‌ సర్వేతో ఈ విషయాలు బయటపడుతున్నాయి. జ్వరాలు, జలుబు, దగ్గు,

మహమ్మారి విలయతాండవం

జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య
500 మార్క్‌ను దాటిన వైనం
ఫీవర్‌ సర్వేతో లక్షణాలు ఉన్నవారి గుర్తింపు
చికిత్సకు ఏర్పాట్లు చేసిన వైద్య ఆరోగ్యశాఖ

నిజామాబాద్‌, జనవరి 22(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. శనివారం ఒక్క రోజే 500పైగా కేసు లు నమోదు కావడం ఇందుకు నిదర్శనం. కాగా, జిల్లాలో జరుగుతున్న ఫీవర్‌ సర్వేతో ఈ విషయాలు బయటపడుతున్నాయి. జ్వరాలు, జలుబు, దగ్గు, ఇతర లక్షణాలతో పాటు కరోనా లక్షణాలు ఉన్న వారు ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నారు. ఫీవర్‌ సర్వేలో వందలాది మంది వివరాలను సేకరిస్తున్నారు. ఎక్కడికక్కడ వారికి మందులు అందిస్తూ హోం ఐసొలేషన్‌లో ఉండాలని కోరుతున్నారు. త్వరగా సర్వే పూర్తిచేసి ఎక్కువ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఫ బయటపడుతున్న ఒమైక్రాన్‌ వేరియంట్‌
జిల్లాలో గడిచిన నెల రోజులుగా కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. జిల్లాలో పీహెచ్‌సీల వారిగా నిర్వహిస్తున్న పరిక్షలతో ఇవి బయటపడుతున్నాయి. కరోనాతో పాటు ఒమిక్రాన్‌ వేరియంట్‌లు వస్తున్నట్లు వైద్యులు అనుమానిస్తున్న సరైన పరిక్షలు లేకపోవడం వల్ల అన్ని కొవిడ్‌గానే నిర్దారిస్తున్నారు. పాజిటీవ్‌ వచ్చిన వారికి చికిత్స అందించే ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఈ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ని జామాబాద్‌ నగరంతో పాటు బోధన్‌, ఆర్మూర్‌ మున్సిపాలిటిల ప్రాంతాల్లో కూడా కేసులు బాగా పెరిగాయి. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో కూడా కేసులు బాగా పెరుగుతున్నాయి. జిల్లాలో ప్రతిరోజు 1500ల నుంచి 2వేల వరకు టెస్టులు నిర్వహిస్తున్న 450కి పైగా పాజిటీవ్‌ కేసులు వస్తున్నాయి. జిల్లాలో ఒకేసారి కేసుల సంఖ్య పెరగడంతో వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్‌, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్‌ శాఖలతో పాటు బ్యాంకింగ్‌, ఇతర శాఖల ఉద్యోగులు వైరస్‌బారిన ఎక్కువగా పడుతున్నారు. రెండవ వేవ్‌తో పోలీస్తే వైరస్‌ తీవ్రత తక్కువగా ఉన్న వ్యాప్తి మాత్రం ఎక్కువగా ఉంది.
ఫ ఫీవర్‌ సర్వే ద్వారా వివరాల సేకరణ
జిల్లాలో కొవిడ్‌ వ్యాప్తి భారీగా పెరగడంతో యంత్రాంగం ఇంటింటికీ తిరుగుతూ ఫీవర్‌ సర్వే మొదలుపెట్టింది. ఈ సర్వే ద్వారా కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తున్నారు. కుటుంబంలో ఉన్న సభ్యుల వివరాలను తెలుసుకోవడంతో పాటు జ్వరం, ఇతర లక్షణాలు, కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వివరాలను నమోదు చేస్తున్నారు. వారికి కావాల్సిన మందులు అందిస్తున్నారు. జిల్లాలో ఫీవర్‌ సర్వేతో భారీగా కేసులు బయటపడుతున్నాయి. జిల్లాలో 1260కి పైగా బృందాలు ఇళ్లు ఇళ్లు తిరుగుతూ వివరాలు సేకరిస్తుండడంతో ఎక్కువ కేసులు బయటకివస్తున్నాయి. సాధారణ జ్వరాలుగా భావించిన వారికి కూడా లక్షణాలు ఉండడంతో వెంటనే ఐసొలేషన్‌ కిట్‌ను ఇస్తున్నారు. వారం పాటు ఇంట్లోనే ఉండి చికిత్స పొందాలని ఆదేశాలు ఇస్తున్నారు.
ఫ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు
జిల్లాలో శుక్రవారం జరిగిన ఫీవర్‌ సర్వేలో 1835కి పైగా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మందుల కిట్లను అందించారు. జిల్లాలో లక్ష 6093 ఇళ్లను తిరిగి మొత్తం 3లక్షల 83వేల 891 మందికి సంబందించిన వివరాలను సేకరించారు. పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ ప్రభుత్వానికి పంపిస్తున్నారు. ఈ ఫీవర్‌ సర్వేలో కరోనాతో పాటు ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరంతో పాటు ధీర్ఘకాలిక వ్యాధు లు ఉన్నవారి వివరాలను కూడా వివరాలను నమోదు చచేస్తున్నారు. జ్వరాలు వచ్చినవారు ఏయే ఆహార పదార్థాలు తీసుకుంటున్నా రు. ఏయే ఆహార పదార్థాలు తీసుకుంటే బలమైన ఆహారం అందు తుందో వారికి వివరిస్తున్నారు. నూనెల వాడకం, వ్యాక్సిన్‌ తీసుకున్నవారి వివరాలు నమోదు చేస్తూన్నారు. సరిహద్దుల్లో చిరుధాన్యా ల వాడకం, ఇతర వివరాలను తీసుకుంటున్నారు. సర్వే చేస్తున్న అన్ని గ్రామాల పరిధిలో కేసులు నమోదుకాని గ్రామాల వివరాల ను కూడా తీసుకుంటున్నారు. ఒక్క కేసు కూడా నమోదుకాకుంటే కారణాలు కూడా విశ్లేషించేందుకు సిద్ధమవుతున్నారు.
ఫ అవసరమైన వారికి మందుల అందజేత
అవసరం మేరకు మందులు అందిస్తూనే అవసరమైన వారికి స్థానిక పీహెచ్‌సీల్లో చికిత్స అందించేందుకు ఏర్పాట్లను చేస్తున్నా రు. సీరియస్‌గా ఉన్నవారిని అంబులెన్స్‌ల ద్వారా ప్రభుత్వ జనర ల్‌ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇంటింటికి సర్వే చేపట్టిన విధంగానే అన్ని గ్రామాల పరిధిలో కేసుల వివరాలను గ్రామ పంచాయతీల్లో ఉంచుతున్నారు. సీరియస్‌ అయితే ఏ ఆసుపత్రులకు పంపించాలో? సర్పంచ్‌, గ్రామ కార్యదర్శులకు అందిస్తున్నారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రితో పాటు ఇతర ఆసుపత్రులకు పం పించి చికిత్స అందించాలని కోరుతున్నారు. మున్సిపాలిటిల్లో వా ర్డుల వారిగా వివరాలను నమోదు చేస్తున్నారు. అర్బన్‌ పీహెచ్‌సీల పరిధిలో వివరాలను ఉంచుతూ ఆశ, అంగన్‌వాడీ కార్యకర్త ల ద్వారా ఈ వివరాలను నమోదు చేస్తున్నారు. మరో మూడు రో జుల్లో సర్వే పూర్తిచేసి కేసులు ఎక్కడికక్కడ తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి, రెండవ వేవ్‌ కంటే మూడో వేవ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ఈ చర్యలు చేపడుతున్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌, మందుల కొరత రాకుండా ఏర్పాట్లను చేస్తున్నారు.

Updated Date - 2022-01-23T06:45:15+05:30 IST