నామినేషన్ల పర్వాన్ని పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-04-17T05:23:06+05:30 IST

నామినేషన్ల పర్వాన్ని పకడ్బందీగా నిర్వహించాలి

నామినేషన్ల పర్వాన్ని పకడ్బందీగా నిర్వహించాలి
ఎన్నికల అధికారికి నామినేషన్లు అందజేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు మాదారం నర్సింహగౌడ్‌, మాసుల లావణ్య

  • రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌
  •  కొత్తూర్‌ మున్సిపాలిటీ ఎన్నికలకు మొదటిరోజు ఏడు నామినేషన్లు 

కొత్తూర్‌: మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల పర్వాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అధికారులకు సూచించారు. కొత్తూర్‌ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్‌ సెంటర్‌ను సందర్శించిన అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మూడురోజుల పాటు నామినేషన్ల పర్వం కొనసాగుతుందని, నామినేషన్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులకు అధికారులు తగిన సూచనలు, సలహాలు అందించాలని పేర్కొన్నారు. కొవిడ్‌ను నిభంధనలు పాటించాలన్నారు. ఆయన వెంట షాద్‌నగర్‌ ఆర్డీవో రాజేశ్వరి, మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌, ఎన్నికల అధికారి జనుంపల్లి జ్యోతి ఉన్నారు. కాగా కొత్తూర్‌ మున్సిపాలిటీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ హాల్‌లో ఏర్పాటుచేసిన నామినేషన్‌ సెంటర్‌లో గురువారం మొదటిరోజు కాంగ్రెస్‌ పార్టీ నుంచి 9వ వార్డు అభ్యర్థిగా మాదారం నర్సింహగౌడ్‌, 8వ వార్డు నుంచి మాసుల లావణ్యలు నామినేషన్‌ దాఖలు చేశారు. 2వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి అమడాపురం నర్సింహగౌడ్‌, 6వ వార్డు నుంచి కె. మమత, 10వ వార్డు నుంచి పిట్టల శేఖర్‌, 11వ వార్డుకు ఇద్దరు అభ్యర్థులు బీజేపీ నుంచి తుప్పర మంజుల, స్వతంత్ర అభ్యర్థిగా జంగగళ్ల పద్మమ్మలు నామినేషన్లు దాఖలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కడెంపల్లి శ్రీనివా్‌సగౌడ్‌, ఎంపీటీసీ జంగగళ్ల కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T05:23:06+05:30 IST