మావోయిస్టులతో ప్రజలకు ఒరిగేదేమి లేదు

ABN , First Publish Date - 2020-09-22T05:54:56+05:30 IST

మావోయిస్టులతో ప్రజలకు ఒరిగేదేమి లేదని పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ అన్నారు. సోమవారం ప్రాణహిత నది తీర ప్రాంతాల్లో జైపూర్‌ ఏసీపీ

మావోయిస్టులతో ప్రజలకు ఒరిగేదేమి లేదు

వేమనపల్లి, సెప్టెంబరు 21 :  మావోయిస్టులతో ప్రజలకు ఒరిగేదేమి లేదని పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ అన్నారు. సోమవారం ప్రాణహిత నది తీర ప్రాంతాల్లో జైపూర్‌ ఏసీపీ నరేందర్‌తో కలిసి పర్యటించారు. ఇటీవల జరిగిన కదంబ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో మావోయిస్టులు నది దాటి ఇటు వైపుగా వచ్చే అవకాశాలు ఉన్నందున పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో సుమారు 300 మంది పోలీసులతో కూంబింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లెం పల్లి గ్రామస్థులతో డీసీపీ మాట్లాడుతూ మావోయి స్టులకు ఎవరు సహకరించవద్దని, అలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. ఏమైనా సమస్యలుంటే పోలీసులకు తెలియ జేయాలని వాటిని పరిష్కరిం చేందుకు కృషి చేస్తామన్నారు.


యువకులు మంచి ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని చక్కగా చదువుకోవాలన్నారు. గ్రామాల్లో ఎవ రైనా కొత్త వ్యక్తులు అనుమానాస్ప దంగా కనిపిస్తే పోలీసులకు సమా చారం అందించాలని సూచించారు. ప్రాణహిత నదిలో పడవలు నడిపే వారితో మాట్లాడారు. పడవల్లో ఎవ రైనా అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసు లకు సమాచారం అందించాలని సూచిం చారు. డీసీపీ వెంట చెన్నూరు రూరల్‌ సీఐ నాగరాజు, స్ధానిక ఎస్‌ఐ రహీంపాషా, సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు ఉన్నారు. 

Updated Date - 2020-09-22T05:54:56+05:30 IST