భానుడి భగభగ

ABN , First Publish Date - 2020-05-23T09:13:36+05:30 IST

భానుడుభగభగ మండుతున్నాడు. తాండూరులో శుక్రవారం 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

భానుడి భగభగ

తాండూరు 42, ఆమనగల్లులో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

ఉక్కపోతతో  జనం ఉక్కిరిబిక్కిరి

భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు.


ఉదయం నుంచే ఉగ్రరూపం దాలుస్తూ జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. దీంతో పట్టణాలు, గ్రామాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. దీంతో జనం ఎండ వేడిమికి అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు. 


తాండూరు/బషీరాబాద్‌/ఆమనగల్లు: భానుడుభగభగ మండుతున్నాడు. తాండూరులో శుక్రవారం 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈనెల మొదటి వారం నుంచే గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మండుతున్న ఎండలతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో పనుల నిమిత్తం ప్రజలు బయటికి వస్తున్నారు. ఉదయం 11 గంటలు దాటితే ఎండ తీవ్రత పెరుగుతోంది.  రాత్రి వేళల్లో ఉక్కపోతకు తోడు కరెంటు కోతలు కూడా విధిస్తుండంతో ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు.


పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండంతో వడగాల్పులు కూడా వీస్తున్నాయి. వెచ్చని గాలితో ప్రజలు మరింత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బషీరాబాద్‌ మండలంలో కొర్విచెడ్‌, నవాల్గ, మాసన్‌పల్లి, జీవన్గి, క్యాద్గీరా, ఎక్మాయి గ్రామాలపరిధిలో నాపరాళ్ల నిక్షేపాలు విస్తరించి ఉండటంతో ఎండ  వేడిమి  తీవ్రంగా ఉంది.   ఆమనగల్లులో  40డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీశైలం -హైద్రాబాద్‌ ప్రధాన రహదారి బోసిపోయిది.

Updated Date - 2020-05-23T09:13:36+05:30 IST