‘ఉపాధి’ పనుల్లో కూలీల శాతం పెంచాలి

ABN , First Publish Date - 2021-04-21T06:11:51+05:30 IST

గ్రామీణ ఉపాధి హమీ పథకం ద్వారా చేపట్టిన పనుల్లో కూలీల శాతం పెంచాలని అడిషనల్‌ కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) అరుణశ్రీ ఆదేశించారు.

‘ఉపాధి’ పనుల్లో కూలీల శాతం పెంచాలి
పోతారంలో అధికారులకు సూచనలు ఇస్తున్న అరుణశ్రీ

మల్యాల, ఏప్రిల్‌ 20: గ్రామీణ ఉపాధి హమీ పథకం ద్వారా చేపట్టిన పనుల్లో కూలీల శాతం పెంచాలని అడిషనల్‌ కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) అరుణశ్రీ ఆదేశించారు. మండలంలోని పోతారం, మానాల గ్రామాల్లో ఉపాధి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కూలీలతో మాట్లాడారు. ఈ వేసవిలో వారికి 30శాతం కూలీ వేతనం ప్రభుత్వం పెంచిందని, ఈ విషయం కూలీలకు తెలుపాలన్నారు. ప్రతి గ్రామంలో వందకు తక్కువ కాకుండా కూలీలు హజరయ్యేలా చూడాలని సూచించారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవలన్నారు. అడిషనల్‌ కలెక్టర్‌ వెంట డీఎల్‌పీవో ప్రభాకర్‌, ఎంపీడీవో శైలజారాణీ, ఎంపీవో బషీర్‌, ఏపీవో శ్రీనివాస్‌, ఈసీ మనోజ్‌, టీఏలు జలపతిరెడ్డి, లావణ్య పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.

 ఉపాధి పనులు పరిశీలించిన ఆర్‌డీఓ

కథలాపూర్‌  మండలంలోని దుంపెటలో మంగళవారం కోరుట్ల ఆర్‌డీఓ వినోద్‌కుమార్‌ ఉపాధిహామి పనులను పరిశీలించారు. పని ప్రదేశాల వద్ద ప్రథమ చికిత్స కిట్లు, నీటి సదుపాయం, నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో కూలీల హాజరు శాతం పెంచాలని పంచాయతీ కార్యదర్శికి చెప్పారు. కూలీలు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని కోరారు. అనంతరం కలికోటలో పల్లె ప్రకృతి వనం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీఓ సతీష్‌, సర్పంచులు అంబటి లతపురుషోత్తం, దరావత్‌ సరోజ, ఎంపీటీసీలు మల్యాల రమేశ్‌, గంగం దేవేంద్రగంగారెడ్డి, వీఏఓలు ఉన్నారు.

కొవిడ్‌-19పై అవగాహన

కొడిమ్యాల: మండలంలోని రాంసాగర్‌ గ్రామంలో మంగళవారం ఉపాధిహామీ పనుల చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి పనులను ఎంపీడీవో రమేష్‌ పరిశీలించారు.  కొవిడ్‌-19పై  అవగాహన కలిపించారు. మాస్కులను వినియోగించాలన్నారు. అనంతరం కంపోస్ట్‌ షెడ్‌ను పరిశీలించారు. ఎంపీడీవో వెంట ఎంపీవో గంగాధర్‌, ఏపీవో రమాపతి, గ్రామ నాయకులు గంగారావు ఉన్నారు.

Updated Date - 2021-04-21T06:11:51+05:30 IST