మొబైల్ ఫోను మింగిన ఘనుడు... బ్యాటరీ పేలకుండా కాపాడిన వైద్యులు!

ABN , First Publish Date - 2021-09-06T17:37:44+05:30 IST

ఎవరైనా సరే ఫోనును అమాంతం మింగగలరా?...

మొబైల్ ఫోను మింగిన ఘనుడు... బ్యాటరీ పేలకుండా కాపాడిన వైద్యులు!

న్యూఢిల్లీ: ఎవరైనా సరే ఫోనును అమాంతం మింగగలరా? ఒక వ్యక్తి మాత్రం ఈ వింత ప్రయత్నంలో విజయం సాధించాడు. అయితే ఈ చర్యతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. నోకియా 3310 సెల్ ఫోనును మింగే ప్రయత్నం చేసిన ఒక యువకుడు చివరికి వైద్యులు చేసిన సర్జరీతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. కొసావో రాజధాని ప్రిస్టినాకు చెందిన 33 ఏళ్ల వ్యక్తి... నోకియా ఫోన్ 2000 మోడల్‌ను మింగేశాడు. 


ఫలితంగా ఫోన్ కడుపులో ఇరుక్కుపోవడంతో అతను బాధతో తల్లడిల్లిపోయాడు. అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లగా, డాక్టర్ స్కండర్ తెలాజాకూ... అతని కడుపులోని ఫోనును బయటకు తీశారు. వైద్యుడు తొలుత బాధితునికి స్కానింగ్ తీయించడంతోపాటు పలు వైద్య పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఆ ఫోన్ అతని కడుపు జీర్ణించుకోలేనంత పెద్దది అని తేలింది. అయితే ఫోనులోని బ్యాటరీ పేలితే బాధితుని ప్రాణాలు పోవచ్చని వైద్యుడు ముందుగా గుర్తించారు. అందుకే అత్యంత జాగ్రత్తగా వైద్యులు ఆపరేషన్ చేసి, ఫోనును బయటకు తీశారు. ఈ సందర్భంగా డాక్టర్ తెలాజాకూ మాట్లాడుతూ... ఫోను మింగిన బాధితునికి అవసరమైన అన్ని రకాల వైద్యపరీక్షలు చేసిన తరువాత అతని కడుపులో ఫోను మూడు ముక్కలుగా ఉన్నట్టు గుర్తించామన్నారు. అయితే ఆ ఫోను బ్యాటరీ అప్పటివరకూ పేలిపోలేదని, అదేగానీ జరిగితే బాధితుడు మరణించేవాడని తెలిపారు. 


Updated Date - 2021-09-06T17:37:44+05:30 IST