పిజో మీటర్లు వచ్చేశాయ్‌

ABN , First Publish Date - 2021-09-19T05:23:40+05:30 IST

పిజో మీటర్లు వచ్చేశాయ్‌

పిజో మీటర్లు వచ్చేశాయ్‌
పిజో మీటర్‌ను పరిశీలిస్తున్న అధికారులు

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి): మేడ్చల్‌ -మల్కాజ్‌గిరి జిల్లాలో భూగర్భ జలాలను కొలవడానికి వరల్డ్‌ బ్యాంకు 19 పిజోమీటర్లను  ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ క్రమంలో శనివారం శామీర్‌పేట మండలం పొన్నాల గ్రామంలో హైస్కూల్‌లో పిజోమీటర్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇప్పటికే 26 పిజో మీటర్లతో భూగర్భ జలాలను కొలుస్తున్నామని, వాటితో పాటు మరో 19పిజో మీటర్లను ఏర్పాటు చేస్తే భూగర్భ జలాల నిల్వలపెరగుదల, తగ్గుతలపై స్పష్టమైన నివేదికలు రూపొందించుకునే అవకాశం ఉంటుందని  భూగర్భజలశాఖ డైరెక్టర్‌  డాక్టర్‌మధు, జిల్లా భూగర్భజలశాఖ అధికారి రేవతి అన్నారు.  కొత్తగా జిల్లాకు మంజూరు చేసిన 19 పిజోమీటర్ల ఏర్పాటుకు స్థలాల గుర్తించామన్నారు. కార్యక్రమంలో భూగర్భజల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సి.రాకేష్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మహేష్‌, వరల్డ్‌ బ్యాంకు కన్సల్టెంట్‌ డాక్టర్‌ బీఎస్‌ చెట్టి, హైడ్రోజియాలిస్ట్‌ ఏడుకొండలు, సర్పంచ్‌ సుకన్య, ఎంపీటీసీ మౌనిక, విజయలక్ష్మి, సంధ్యారాణి పాల్గొన్నారు.

Updated Date - 2021-09-19T05:23:40+05:30 IST