Abn logo
Sep 25 2021 @ 23:28PM

గుంతలు తవ్వారు.. వదిలేశారు

రోడ్డుపక్కన గుంత తవ్వి వదిలేసిన దృశ్యం

లింగాల, సెప్టెంబరు 25: పులివెందుల-అనం తపురం డబుల్‌రోడ్డులో కేబుల్‌ నెట్‌వర్క్‌ కో సం గుంతలు తవ్వారు, వాటిని తిరిగి పూడ్చ కుండా అలాగే వదిలేయడంతో ఆ రోడ్డున వె ళ్లేవారు ప్రమాదాలకు గురవుతున్నారు. పులి వెందుల నుంచి అనంతపురం జిల్లాలోని ప లు ప్రాంతాలకు భూమిలోపల కేబుల్‌ కనె క్ష న్‌ ఇస్తున్నారన్నారు. ఇందుకోసం పులివెం దు ల నుంచి పార్నపల్లె వరకు రోడ్డు పక్కనే జేసీబీలతో గుంతలు తవ్వారు.

పని పూర్తి అయిన తర్వాత వాటిని తిరిగి పూడ్చాల్సిన సిబ్బంది అక్కడక్కడా అలాగే వదిలే స్తున్నారు. రోడ్డు పక్కగా ఉన్న గుంత లను వాహనదారులు చీకట్లో గుర్తించ లేక పోవడంతో ప్రమాదాలకు గురవు తున్నారు. ఇటీవల ఓ ద్విచక్రవాహ నంలో వెళుతున్న వారు గుంతలను గమనించకపోవడంతో ప్రమాదానికి గురయ్యారు. ఇంకొందరు మృత్యువా తపడ్డారు. ఇప్పటికైనా అధికారులు గుంతలు పూడ్చేవిధంగా చర్యలు తీసు కోవాలని పలువురు కోరుతున్నారు.