జగిత్యాలలో సమీకృత మార్కెట్‌ స్థలంపై పునరాలోచించాలి

ABN , First Publish Date - 2022-01-18T06:06:25+05:30 IST

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలో నిర్మాణం చేపట్టనున్న సమీకృత మార్కెట్‌ స్థల ఎంపి క నిర్ణయం ఉపసంహరించుకోవాలని జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక నాయకుల డిమాండ్‌ చేశారు.

జగిత్యాలలో సమీకృత మార్కెట్‌ స్థలంపై పునరాలోచించాలి
ధర్నా చేస్తున్న రైతు ఐక్యవేదిక, బీజేపీ కిసాన్‌ మోర్చా నాయకులు

జగిత్యాల అగ్రికల్చర్‌, జనవరి 17: జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలో నిర్మాణం చేపట్టనున్న సమీకృత మార్కెట్‌ స్థల ఎంపి క నిర్ణయం ఉపసంహరించుకోవాలని జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక నాయకుల డిమాండ్‌ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంరతం కలెక్టరేట్‌ కార్యాలయ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్‌ యార్డు నిర్వహిస్తున్న స్థలంలో సమీకృత మార్కెట్‌ నిర్మించే ఆలోచనను మానుకోవాలని అన్నారు. మార్కెట్‌యార్డు స్థలంలో పంట ఉత్పత్తుల విక్ర యాలు జరుగుతాయని, ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యా మ్నాయ పంటల సాగుతో ఈ మార్కెట్‌ యార్డుకు మరింత డిమాండ్‌ పెరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ మార్కెట్‌ యార్డు స్థలంలో సమీకృత మార్కెట్‌ నిర్మాణం విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పునరాలోచించి, తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు ఐక్యవేదిక నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి, చింతలపెల్లి గంగారెడ్డి, బందెల మల్లయ్య, క్యాతం సాయి రెడ్డి, శేర్‌ నర్సారెడ్డి, ఏలేటి రాజారెడ్డి, కొట్టాల మోహన్‌రెడ్డి, కోల నారా యణ, చంద్రశేఖర్‌ రెడ్డి, వామన్‌రెడ్డి, శంకర్‌ తదితరులున్నారు.

బీజేపీ కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో...

   వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సమీకృత మార్కెట్‌ నిర్మాణం కొరకు రెండెకరాల స్థలం కేటాయించడాన్ని నిరసిస్తూ సోమవారం బీజేపీ కిసాన్‌మోర్చా నాయకులు కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి. కలెక్టరేట్‌ కార్యాలయ అఽధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్‌ యార్డు పరిధిలో రెండెకరాల భూమిని సమీకృత మార్కెట్‌ నిర్మాణం కొరకు స్థల కేటా యింపునకు ఎమ్మెల్యే కలెక్టర్‌కు లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆరుతడి పంటలు వేయమని చెప్పిన ప్రభుత్వం రైతులు పంటను అమ్ముకోవడానికి స్థలం లేకుండా చేయడం ఏమిటని ప్రశ్నించారు. కనీసం రైతులతో సంప్రదింపులు జరపకుండా అభిప్రాయ సేకరణ చేయకుండా కలెక్టర్‌కు స్థలం కేటాయించాలని లేఖ రాయడం రైతులను చులకనగా చూసినట్లేనని అన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహ రించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో కిసాన్‌మోర్చ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఉద్యమాలకు సిద్దం అవుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌మోర్చ జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపా ల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ముత్యంరెడ్డి, మండల అధ్యక్షుడు కర్నె నర్సింహా రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముద్దం రాము, జిల్లా అధికార ప్రతినిధి భూమి రమణ, రూరల్‌ మండల అధ్యక్షుడు నలువాల తిరుపతి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

స్థల కేటాయింపు నిర్ణయం పునఃపరిశీలించాలి

  జగిత్యాల బీటు బజార్‌లోని వ్యవసాయ మార్కెట్‌కు చెందిన స్థలాన్ని సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణం కొరకు కేటాయింపు నిర్ణయాన్ని కలెక్టర్‌ పున:పరిశీలించాలని జగిత్యాల ఏఎంసీ చైౖర్మన్‌ దామోదర్‌రావు కలెక్టర్‌కు లేఖ రాశారు. ఈ సందర్భంగా దామోదర్‌ రావు మాట్లాడుతూ  రైతు పక్షపాతిగా కేసీఆర్‌ అనేక రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాడన్నారు. ప్రత్యామ్నాయ పంటల  కొనుగోలు కేంద్రంగా  మార్కెట్‌ యార్డు 14 మండలాల రైతులకు సేవలందిస్తుందన్నారు. అలాంటి మార్కెట్‌లో రెండెకరాల స్థలం తీసుకొని సమీకృత మార్కెట్‌ నిర్మాణం చేపట్టాలనే ఆలోచన సబబు కాదన్నారు. మార్కెట్‌ యార్డు ఇబ్బందులు, సేవలు పరిగణలోకి తీసుకోకుండా, ఏఏంసీ పాలకవర్గాన్ని సంప్రదించకుండా స్థల కేటాయింపుపై ప్రతిపాదనలు పంపడం తనను విస్మయానికి గురి చేసిందని ఏఎంసీ ఛైర్మెన్‌ దామోదర్‌ రావు లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్‌ యార్డు స్థలాన్ని సమీకృత మార్కె ట్‌కు కేటాయించినట్లయితే రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. కలెక్టర్‌ ఆదేశాలను, అధికారాలను తాను ప్రశ్నిచడం లేదని, వాస్తవాలను పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని కోరారు.  

Updated Date - 2022-01-18T06:06:25+05:30 IST