Abn logo
Jun 24 2021 @ 01:15AM

మొక్కలను సిద్ధం చేయాలి

కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌కు మాస్క్‌లు అందజేస్తున్న క్యూబ్‌రూట్స్‌ ఫౌండేషన్‌ సభ్యులు

కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌

నల్లగొండ టౌన్‌, జూన్‌ 23: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో నాటేందుకు మొక్కలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సూచించారు. కలెక్టరేట్‌ నుంచి వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏఈ, పీఆర్‌, కార్యదర్శులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మొక్క లు లేని చోట కొనుగోలు చేయాలన్నారు. అవె న్యూ ప్లాంటేషన్‌లో భాగంగా రెండు వరుసల్లో మొక్కలు నాటాలన్నారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, డీఆర్‌డీఏ పీడీ కాళిందిని, జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, పీఆర్‌ ఈఈ తిరుపతయ్య  పాల్గొన్నారు. 


మాస్కులు, శానిటైజర్ల పంపిణీ

క్యూబ్‌ రూట్స్‌ ఫౌండేషన్‌ తరఫున నామ్‌   ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ఆధ్వర్యంలో ఫ్రంట్‌లైన్‌ వారి యర్స్‌కు మాస్క్‌లు, శానిటైజర్లు, పీపీఈ కిట్లను కలెక్టర్‌ పీజే పాటిల్‌కు అందజేశారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా నియంత్ర ణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ పరిపాలనాధికారి మోతీలాల్‌ పాల్గొన్నారు.