చిన్నారి కుటుంబ సభ్యుల ఆందోళన.. దిగొచ్చిన పోలీసులు..

ABN , First Publish Date - 2021-09-16T20:21:30+05:30 IST

హైదరాబాద్: సింగరేణి చిన్నారి ఘటనలో నిందితుడు రాజు మృతదేహాన్ని.. బాధిత కుటుంబ సభ్యులకు చూపిస్తామని పోలీసులు తెలిపారు. చనిపోయింది రాజేనా, కాదా అనే విషయంలో తమకు అనుమానం ఉందని, మృతదేహాన్ని

చిన్నారి కుటుంబ సభ్యుల ఆందోళన.. దిగొచ్చిన పోలీసులు..

హైదరాబాద్: సింగరేణి చిన్నారి ఘటనలో నిందితుడు రాజు మృతదేహాన్ని.. బాధిత కుటుంబ సభ్యులకు చూపిస్తామని పోలీసులు తెలిపారు. చనిపోయింది రాజేనా, కాదా అనే విషయంలో తమకు అనుమానం ఉందని, మృతదేహాన్ని చూపించాలని చిన్నారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు దిగొచ్చారు. మృతదేహాన్ని వారికి చూపించడానికి కుటుంబ సభ్యులను వరంగల్ ఎంజీఎంకు పోలీసులు.. తమ వాహనంలోనే తీసుకెళ్లనున్నారు. బాధితురాలి మేనమామతో పాటు 5 గురు సింగరేణి కాలనీ వాసులను కూడా తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. రాజు మృతదేహాన్ని తమకు అప్పగించాలని, అప్పుడే తాము అంగీకరిస్తామని.. చిన్నారి బంధువులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.


మరోవైపు నిందితుడు రాజు మృతిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం అనంతరం రాజు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. అయితే రాజు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావడం లేదు.

Updated Date - 2021-09-16T20:21:30+05:30 IST