పోలీస్ స్టేషన్‌కు వచ్చిన 62 ఏళ్ల వృద్ధురాలు.. ఏమైంది బామ్మా.. అని అడిగితే ఆమె చెప్పింది విన్న ఆ పోలీసులకు..

ABN , First Publish Date - 2021-11-28T00:04:30+05:30 IST

మధ్యప్రదేశ్‌లో 62 ఏళ్ల వృద్ధురాలికి పెద్ద కష్టం వచ్చింది. తన గోడును వెళ్లబోసుకునేందుకు పోలీసు స్టేషన్‌కు వచ్చింది. ఏమైంది బామ్మా.. అంటూ అడిగిన పోలీసులు..

పోలీస్ స్టేషన్‌కు వచ్చిన 62 ఏళ్ల వృద్ధురాలు.. ఏమైంది బామ్మా.. అని అడిగితే ఆమె చెప్పింది విన్న ఆ పోలీసులకు..

వృద్ధాప్య సమయంలో చాలా మంది రామా.. కృష్ణా.. అనుకుంటూ కాలం వెళ్లదీస్తుంటారు. ఇంకొందరు మనువళ్లు, మనువరాళ్లతో సరదాగా గడుపుతూ ఉంటారు. మరికొందరైతే కొడుకులు పట్టించుకోని కారణంగా వృద్ధాశ్రమాల్లో ఉంటూ జీవనం సాగిస్తుంటారు. ఎవరు ఎక్కడున్నా.. ఆ వయసులో ఉన్న వారెవరైనా కాసింత అన్నం దొరికితే చాలు అనుకుంటూ ఉంటారు. అయితే మధ్యప్రదేశ్‌లో 62 ఏళ్ల వృద్ధురాలికి పెద్ద కష్టం వచ్చింది. తన గోడును వెళ్లబోసుకునేందుకు పోలీసు స్టేషన్‌కు వచ్చింది. ఏమైంది బామ్మా.. అంటూ అడిగిన పోలీసులు, ఆమె చెప్పింది విని షాక్ అయ్యారు..


మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌ పరిధి గౌతమ్ మధ్యాలో ఓ వృద్ధురాలు నివాసం ఉంటోంది. ఆమె ప్రభుత్వ కళశాలలో పని చేస్తూ రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం వృద్ధురాలు ఒక్కటే ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో సమీపంలోని  జియోలా సింగ్ అనే వృద్ధుడు ఈమె ఇంటికి రోజూ వస్తూ, పోతూ ఉండేవాడు. తెలిసిన వారే కదా అని వృద్ధురాలు కూడా అతనితో చనువుగా మాట్లాడుతూ ఉండేది. అయితే ఆ వయసులో ఎవరికీ రాని ఆలోచన.. ఆ వృద్ధుడికి వచ్చింది. వృద్ధురాలిని ఎలాగైనా అత్యాచారం చేయాలని కుట్ర పన్నాడు. కానీ అదును కోసం వేచి చూస్తూ ఉండేవాడు.


ఓ రోజు చుట్టు పక్కల ఎవరూ లేరని గ్రహించి, ఒంటరిగా ఉన్న వృద్దురాలిపై దాడి చేశాడు. బలవంతంగా అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇలా రోజూ ఆమెపై అత్యాచారం చేస్తూ ఉండేవాడు. బయటికి చెప్పకోలేక లోలోపలే కుమిలిపోతూ.. వృద్ధురాలు నరకం అనుభవించేది. అయితే రోజురోజుకూ నిందితుడి వేధింపులు ఎక్కువ అవుతుండడంతో చివరికి తెగించి.. గార్హ పోలీసును ఆశ్రయించింది. అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Updated Date - 2021-11-28T00:04:30+05:30 IST