Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళ.. ఏమైందని అడిగితే ఆమె చెప్పింది విని పోలీసులకు షాక్.. హుటాహుటిన ఆ బంగ్లాలోకి వెళ్లి చూస్తే..

భార్యాభర్తల మధ్య గొడవలు ఉండొచ్చు గానీ.. కోపం, పగ, అనుమానం మాత్రం ఉండకూడదు. ఒక్కోసారి కొందరు.. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మళ్లీ మళ్లీ తప్పులు చేస్తుంటారు. చివరకు జైలుపాలవుతుంటారు. కర్ణాటకలో ఓ మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఆమె చెప్పింది విని పోలీసులే షాక్ అయ్యారు. చివరగా అసలు విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే..

కర్ణాటకలోని దొడ్డబళ్లాపురం నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. పలార్‌స్వామి అలియాస్‌ స్వామిరాజ్‌ (50) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి బ్యూటిషియన్ అయిన నేత్ర అనే మహిళతో ఆరేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. తర్వాత ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో బెంగళూరు పరిధిలోని పలు ప్రాంతాల్లో లేఅవుట్లు వేసి బాగా సంపాదించాడు. దీంతో రెండో భార్యకు క్యాతనహళ్లి వద్ద కోట్ల రూపాయలు వెచ్చించి.. పెద్ద బంగ్లా నిర్మించి ఇచ్చాడు. ఇలా సాగుతున్న వీరి జీవితంలో అనుకోని ఘటన జరిగింది.

ఈ క్రమంలో గత ఆదివారం రెండో భార్య ఇంటికి వెళ్లిన స్వామిరాజ్‌‌పై ఆమె దాడి చేసింది. ఇనుప రాడ్‌తో దారుణంగా హత్య చేసి, పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. తనను పరాయి మగవారి వద్దకు వెళ్లాలని బలవంతం చేస్తున్నాడని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బంగ్లాలో పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టునిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే హత్య వెనుక గల కారణాలపై వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇదిలావుండగా.. తమపై ప్రేమ చూపిస్తున్నాడనే కారణంతోనే హత్య చేశారని మొదటి భార్య ఆరోపిస్తోంది. దీంతో పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement