సైబర్‌ గుట్టు రట్టు చేసిన పోలీసులు

ABN , First Publish Date - 2022-01-22T04:48:23+05:30 IST

నెట్‌ సెంటర్‌లో పని చేస్తూ సైబర్‌ నేరాలకు తెరలేపిన యువకుడి గుట్టును కడ ప సైబర్‌ క్రైం సె ల్‌, ప్రొద్దుటూరు పోలీసులు రట్టు చే శారు.

సైబర్‌ గుట్టు రట్టు చేసిన పోలీసులు
పట్టుబడ్డ నిందితుడు - వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ

కడప(క్రైం), జనవ రి 21: నెట్‌ సెంటర్‌లో పని చేస్తూ సైబర్‌ నేరాలకు తెరలేపిన యువకుడి గుట్టును కడ ప సైబర్‌ క్రైం సె ల్‌, ప్రొద్దుటూరు పోలీసులు రట్టు చే శారు. శుక్రవారం జిల్లా పోలీసు కా ర్యాలయ ఆవరణలో నిందితుడిని ఎస్పీ అన్బురాజన్‌ మీడియా ఎదుట హాజరు పరిచి వివరాలు వెల్లడించారు. అతని నుంచి రూ.3 లక్షల నగదు, సీపీయూ పోలీసులు స్వా ధీనం చేసుకున్నారు. ఆధార్‌, పాన్‌ కార్డుల లింక్‌ చేయాలని వచ్చిన బాధిత మహిళ ను బురడీ కొట్టించి వాట్సాప్‌ వెబ్‌ తెరిచి నెట్‌ బ్యాకింగ్‌ పాస్‌వర్డ్‌ తెలుసుకుని నగదు ఉపసంహరణ చేసుకున్నాడు.

మొబైల్‌ నెంబర్‌ పోర్టబులిటీ ద్వారా బాధితురాలి నెం బర్‌ సిమ్‌ తీసుకుని, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా ఖాతాడబ్బులు బదలాయించుకున్నాడు. బాధితులకు ఫోన్‌ చేసి ఆధార్‌, పాన్‌ లింక్‌ కాలేదంటూ వెరిఫికేషన్‌ కోడ్‌, మెసేజ్‌ల స్ర్కీన్‌ షాట్‌ తెప్పించి ఖాతాను యాక్టీవ్‌ చేసుకున్నారు. బాధితురాలు అరుణ ఖాతా నుంచి దఫదఫాలుగా 4.31 లక్షల డ్రా చేసుకున్నాడు. అయితే ఇందులో తన తల్లి కో సం ఖర్చు చేసిన రూ.3లక్షలను పోలీసులు వసూలు చేశారు. సరికొత్త నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎస్పీ సూచన చేశారు. ఆధార్‌, పాన్‌ కార్డుల అనుసంధానం పేరిట, ఫోన్‌ చేసి ఓటీపీ నంబర్‌ అడిగితే ఎవరికీ చెప్పవద్దన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ నేరగాళ్ల మాయ మాటల్లో పడి మోసపోకండని ఎస్పీ తెలిపారు. కేసును చేధించడంలో కృషి చేసిన సైబర్‌ క్రైం సెల్‌ ఇన్‌చార్జ్‌ డీఎస్పీ కె.రవికుమార్‌, ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాద్‌రావు, వన్‌టౌన్‌ సీఐ నాగరాజు, సైబర్‌ క్రైం సెల్‌ ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. 

Updated Date - 2022-01-22T04:48:23+05:30 IST