Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోలీస్‌ కుటుంబాలకు అండగా ఉంటాం

 సీపీ చంద్రశేఖర్‌రెడ్డి 

కోల్‌సిటీ, డిసెంబరు 6: పోలీస్‌ కుటుంబాలకు పోలీస్‌శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని సీపీ చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని మంచిర్యాల ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ కరోనాతో మృతి చెందిన ఎస్‌ఐ జహీరుద్దీన్‌ కుటుంబానికి భద్రత నుంచి వచ్చిన రూ.7.35లక్షల చెక్కును సోమవారం సీపీ కార్యాలయంలో సీపీ చంద్రశేఖర్‌రెడ్డి జహీరుద్దీన్‌ భార్య షాహెద తబస్సుమ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌ సిబ్బంది కుటుంబాలకు సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో పాటు వారికి అండగా ఉంటామని చెప్పారు. జహీరుద్దీన్‌ కుటుంబ స్థితిగతులను సీపీ అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌శాఖ ఎళ్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వపరంగా రావాల్సిన ఇతరాత్ర బెనిఫిట్లను తక్షణమే అందజేసే విధంగా చూస్తామన్నారు. కార్యక్రమంలో పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు బోర్లకుంట పోచలింగం, ఏఓ నాగమణి, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, సీసీ శ్రావణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.


Advertisement
Advertisement