న్యాయవ్యవస్థను సవాల్ చేసే విధానం సరికాదు: హరీశ్ సాల్వే

ABN , First Publish Date - 2020-05-31T16:09:30+05:30 IST

న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసేవారిని..

న్యాయవ్యవస్థను సవాల్ చేసే విధానం సరికాదు: హరీశ్ సాల్వే

న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసేవారిని అదుపు చేయాల్సిందేనని, వారిపై సుప్రీం కోర్టు కూడా తగిన చర్యలు తీసుకోవాలని సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే అభిప్రాయపడ్డారు. ఓ వెబ్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానం ఇచ్చే తీర్పులను తప్పుబడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిని నియంత్రించాల్సిందేనని హరీశ్ సాల్వే తేల్చి చెప్పారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో కోర్టులపై హద్దుమీరి వ్యాఖ్యలు చేస్తున్నారని వారిని అదుపు చేయాల్సిందేనని అన్నారు.


ముఖ్యంగా సామాజిక మాధ్యమాలద్వారా న్యాయవ్యవస్థను అవమానిస్తున్నారని హరీశ్ సాల్వే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని సుప్రీం కోర్టు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసినట్లు మీడియా ద్వారా తెలుసుకున్నానని, ఆ వ్యాఖ్యలను తాను కూడా పరిశీలించినట్లు తెలిపారు. న్యాయవ్యవస్థనే సవాల్ చేసే ఈ విధానం ఏమాత్రం ముమ్మాటికి సరికాదని హరీశ్ సాల్వే స్పష్టం చేశారు.

Updated Date - 2020-05-31T16:09:30+05:30 IST