కొంచెం కష్టం..కొంచెం సులభం

ABN , First Publish Date - 2020-09-28T09:06:31+05:30 IST

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆదివారం పాలీసెట్‌ జరిగింది. విశాఖ నగరంలోని బుల్లయ్య కళాశా ల పరీక్ష కేంద్రాన్ని 1,800 మందికి కేటాయించారు.

కొంచెం కష్టం..కొంచెం సులభం

మాథ్స్‌, ఫిజిక్స్‌ కష్టం.. సుదీర్ఘం

‘జేఈఈ’పై నిపుణుల విశ్లేషణ

పేపర్‌-1, 2ల్లో 396 మార్కులకు పరీక్ష

పరీక్షకు 96 శాతం మంది హాజరు

కరోనా కాలంలో.. ఇవేం పరీక్షలు?

మాథ్స్‌, ఫిజిక్స్‌ కష్టం.. సుదీర్ఘం.. ‘జేఈఈ’పై నిపుణుల విశ్లేషణ.. పేపర్‌-1, 2ల్లో 396 మార్కులకు పరీక్ష


విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి :

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆదివారం పాలీసెట్‌ జరిగింది. విశాఖ నగరంలోని బుల్లయ్య కళాశా ల పరీక్ష కేంద్రాన్ని 1,800 మందికి కేటాయించారు.  కరోనా వైరస్‌ నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని చెబుతున్న అధికారులు.. ఒకే కళాశాలను వందలాది మందికి ఎలా కేటాయించారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


అమరావతి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): దేశంలోని ఐఐటీల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు 96ు మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను ఐఐటీ-ఢిల్లీ దేశవ్యాప్తంగా 222 నగరాల్లోని 1,150 కేంద్రాల్లో నిర్వహించింది. పేపర్‌-1కు 1,51,311 మంది, పేపర్‌-2కు 1,50,900 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్‌-1, 2ల్లో 54 చొప్పున ప్రశ్నలు ఇచ్చారు. ఒక్కో పేపర్‌ 198 మార్కులు చొప్పున మొత్తం 396 మార్కులకు ఈ పరీక్షలు నిర్వహించారు. పేపర్‌-1లో ప్రతి సబ్జెక్ట్‌కు 18 ప్రశ్నలు చొప్పున, పేపర్‌-2లోనూ అదే విధానం అమలు చేశారు. అయితే, కొన్ని ప్రశ్నలకు 3 మార్కులు, మరికొన్ని ప్రశ్నలకు 4 మార్కులు చొప్పున ఇచ్చారు. ప్రతి సబ్జెక్ట్‌లోనూ కొన్ని ప్రశ్నలకు మైనస్‌ మార్కులు కూడా ఉన్నాయి. ఒక్కొ పేపర్‌కు 3 గంటల సమయం ఇచ్చినా, నిర్ణీతా సమయంలో చాలా మంది విద్యార్థులు జవాబులు రాయలేకపోయామని  వాపోయారు.


కాగా, పరీక్షా కేంద్రాల్లో అధికార యంత్రాంగం కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా చర్యలు  తీసుకున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి పేపర్‌-1, 2ల్లో ప్రశ్నావళిని పరిశీలిస్తే.. మాథ్స్‌, ఫిజిక్స్‌ ప్రశ్నలు ఓ మోస్తరు నుంచి క్లిష్టంగా, సుదీర్ఘంగా ఉన్నట్లు అభ్యర్థులు తెలిపారు. అలాగే కెమిస్ర్టీ ప్రశ్నలు సులభంగాను, ఎన్‌సీఈఆర్‌టీ ప్యాట్రన్‌లోనే వచ్చినట్లు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే.. ప్రశ్నలు సులభంగానే ఉన్నప్పటికీ గణాంకాలు, కొన్ని ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నట్లు విశ్లేషకులు తెలిపారు. మాథ్స్‌ పేపర్‌లో ఆల్‌జీబ్రా, క్యాలిక్యులస్‌ ప్రశ్నలు అభ్యర్థులకు కొరుకుడు పడలేదు.  ఫిజిక్స్‌ విషయానికొస్తే.. పేపర్‌-1, 2ల్లో పలు ప్రశ్నలు సుదీర్ఘంగా, మరికొన్ని క్లిష్టంగా ఉన్నాయి. ఫిజిక్స్‌ ప్రశ్నలు రొటేషన్‌, వర్క్‌పవర్‌ ఎనర్జీ, మాగ్నటిజమ్‌, థర్మోడైనమిక్స్‌ చాప్టర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగినట్లు విశ్లేషకులు తెలిపారు. 


కటాఫ్‌ మార్కులు ఇలా

జేఈఈ-అడ్వాన్స్‌డ్‌లో ఓపెన్‌ క్యాటగిరి అభ్యర్థులకు 35ు, ఓబీసీలకు 30ు, ఎస్సీ, ఎస్టీలకు 15ు కటాఫ్‌ మార్కులు ఉం డొచ్చని శ్రీచైతన్య ఆల్‌ ఇండియా ఐఐటీ కోఆర్డినేటర్‌ ఎం.ఉమాశంకర్‌ అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు గరిష్ఠంగా 360 మార్కులు పొందే అవకాశముందన్నారు.  

Updated Date - 2020-09-28T09:06:31+05:30 IST